వేత నాల చెల్లింపు జీవో మున్సిప ల్ కాంట్రాక్ట్ కార్మికుల కు వ ర్తించ దా
Actor ProfileCelebrity

వేత నాల చెల్లింపు జీవో మున్సిప ల్ కాంట్రాక్ట్ కార్మికుల కు వ ర్తించ దా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వేత నాల చెల్లింపు జీవో మున్సిప ల్ కాంట్రాక్ట్ కార్మికుల కు వ ర్తించ దా
Namasthe Telangana3 Sept 2026
వేత నాల చెల్లింపు జీవో మున్సిప ల్ కాంట్రాక్ట్ కార్మికుల కు వ ర్తించ దా

భువనగిరి అర్బన్, జూలై 02 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే జీవో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల‌కు వర్తించదా అని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో భువనగిరిలోని సుందరయ్య భవనంలో మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఊదరి రాoచందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులపై ఎందుకు నిర్లక్ష్యంగా ఉంద‌ని, ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల ఉద్యోగ కార్మికులకు వేతనాలు చెల్లించింది. కానీ నేటి వరకు మున్సిపల్ కాంట్రాక్ట్‌ కార్మికుల అకౌంట్‌లోకి, భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల అకౌంట్ లోకి పడలేదన్నారు. కార్మికుల పట్ల ఎందుకు నిర్లక్ష్యమన్నారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్క‌రించ‌లేద‌న్నారు. అధికారుల వేధింపులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన నిరీక్షణతో పని చేస్తున్నారని అలాంటి కార్మికుల పట్ల వేతనాలు రెగ్యులర్ గా వేత్తనాలు చెల్లించడంలో ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన వేతనాలు, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రుణ సౌకర్యం, బకాయిగా ఉన్న వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిరిపంగి రవి, బట్టు కొండయ్య, దాసరి నరసింహ, ఆడెపు వెంకటేశం, చింతల అశోక్, ఉమేష్, గ్యార స్వామి, చింతల కిష్టమ్మ, రేణుక, శాంతమ్మ, లక్ష్మీ పాల్గొన్నారు