వీడిన వాన గండం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదించిన అం
Actor ProfileActor

వీడిన వాన గండం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదించిన అం

Total News1
Movie Updates0
Sources1
వీడిన వాన గండం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదించిన అంపైర్లు
TV9 Telugu13 Jun 2026
వీడిన వాన గండం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదించిన అంపైర్లు

IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ధర్మశాల వేదికగా ఎట్టకేలకు ప్రారంభమైంది. నిన్నటి రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల మ్యాచ్ జరగడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. మధ్యాహ్నం వాతావరణం అనుకూలించడంతో టాస్ వేశారు. ఈ మ్యాచ్‌లో భారత తాత్కాలిక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని ఉన్నందున.. ప్రారంభంలో పిచ్ నుంచి తమ ఫాస్ట్ బౌలర్లకు లభించే స్వింగ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలనే ప్లాన్‌తో భారత్ బౌలింగ్ తీసుకుంది. ధర్మశాలలో ఎడతెరిపి లేకుండా పడిన చిరుజల్లుల కారణంగా టాస్ వేయడం దాదాపు 3 గంటల 45 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఒకానొక దశలో కట్-ఆఫ్ సమయం దగ్గరపడుతుండటంతో మ్యాచ్ రద్దవుతుందేమోనని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. కానీ మైదానంలో అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ ఉండటంతో.. వర్షం తగ్గిన వెంటనే అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేయకుండా ఇరు జట్లకు చెరో 25 ఓవర్ల పాటు ఆడించాలని నిర్ణయించారు. దీంతో వన్డే మ్యాచ్ కాస్తా.. దాదాపు టీ20 ఫార్మాట్ తరహాలో హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా మారిపోయింది. ఈ తొలి వన్డే మ్యాచ్ ద్వారా భారత జట్టు ఇద్దరు యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ వన్డే క్యాప్‌లను అందించింది. యువ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే, ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌లు ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశారు. కాగా, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లకు ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. 2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా జట్టులో సరికొత్త కాంబినేషన్లను పరీక్షించేందుకే ఈ మార్పులు చేసినట్లు కెప్టెన్ గిల్ తెలిపాడు. రోహిత్ శర్మ ఆల్‌టైమ్ హిస్టారికల్ రికార్డ్ ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్