విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన మలుపు
Actor ProfileCelebrity

విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన మలుపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన మలుపు
TeluguOne20 Jul 2026
విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన మలుపు

విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ మిస్సింగ్ ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఇటు లీగల్ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఏం జరిగింది, ఒక పోలీస్ అధికారి అరెస్ట్ వరకు ఈ వ్యవహారం ఎందుకు దారితీసింది అనే కోణంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ కేసు తీవ్రతను గమనించిన కోర్టు ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని గట్టిగా నిలదీసింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం, జూన్ 29వ తేదీ లోపు పూర్తి వివరాలతో కూడిన సమాధానాన్ని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ ఉదంతం దేశ రాజధాని ఢిల్లీకి సైతం చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తనూజ మరియు గురుమూర్తి ఇద్దరూ కలిసి జాతీయ మానవ హక్కుల కమిషన్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు స్థానిక పరిధిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై భరద్వాజ్.. సిఐ నాగరాజును అరెస్ట్ చేయకుండా తప్పించుకునే పరిస్థితి పోలీసు శాఖకు లేకుండా పోయిందన్నారు. బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ సీఐ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన తీరు ప్రజా బాహుళ్యంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు. అయితే ఈ సింపతీని పక్కదారి పట్టించడానికి ఒక వ్యూహాత్మక నెరేటివ్ కూడా