విజయవాడ రెయిన్ బో హాస్పిటల్ లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది
Actor ProfilePolitician

విజయవాడ రెయిన్ బో హాస్పిటల్ లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది

Total News1
Movie Updates0
Sources1
విజయవాడ రెయిన్ బో హాస్పిటల్ లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది
Vaartha17 Jun 2026
విజయవాడ రెయిన్ బో హాస్పిటల్ లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది

Vijayawada Rainbow Hospital: విజయవాడ లో బుధవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. ప్రముఖ రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది, ఆ వార్డులో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను హుటాహుటిన వేరే సురక్షిత వార్డుల్లోకి తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో ఉన్న చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనని తీవ్ర ఆందోళన చెందారు. ఆస్పత్రి ప్రాంగణంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. Read Also : Nellore Dowry Harassment:అదనపు కట్నం వేధింపులు.. భార్యపై దాడి! అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, ఆస్పత్రి సిబ్బంది సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రత, నష్టాన్ని అంచనా వేసేందుకు ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యం నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. Vizag Techie Gayatri Dead:విహార యాత్రలో ఘోర కన్నీరు.. సాఫ్ట్‌వేర్ వధువు అనుమానాస్పద మృతి! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Weather update: జూన్ దాటినా కరువైన వానలు.. ఆందోళనలో రైతులు! Kakinada News: జ్ఞానేశ్వరి కేసులో