విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్ పాల్
Actor ProfilePolitician

విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్ పాల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్ పాల్
Eenadu30 Jun 2026
విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్ పాల్

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలోని బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల మేర రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా(Vijay Mallya) పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌(Arjun rampal) నటించబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ‘బిలియనీర్‌’(Billionaire) పేరుతో రూపొందనున్న వెబ్‌ సిరీస్‌లో ఆయన విజయ్‌ మాల్యాగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ నిర్మాత ప్రభ్‌లీన్‌ సంధు దీనిపై స్పష్టతనిచ్చారు. ‘బిలియనీర్‌’లో విజయ్‌ మాల్యా పాత్ర లేదని, అయితే ఆయన జీవితం ఆధారంగా ఓ పాత్రను తీర్చదిద్దినట్లు ఆమె చెప్పారు. అందులో అర్జున్‌ రామ్‌పాల్‌ నటిస్తారని స్పష్టం చేశారు. ‘దురంధర్‌’లో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన అర్జున్‌ రామ్‌పాల్‌తో కలసి పనిచేసేందుకు తాము ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ప్రభ్‌లీన్‌ చెప్పారు. ఈ సిరీస్‌కు హన్సల్‌ మెహతా, రాబీ గ్రేవాల్‌ దర్శకత్వం వహించనున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు