
సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఊహలు వీడియోల రూపంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అగ్రనటుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో కనిపించిన సన్నివేశాలు నెటిజన్లను నవ్విస్తుండగా.. అభిమానుల క్రియేటివిటీపై చర్చకు దారి తీస్తున్నాయి. తమిళ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చలో నిలుస్తున్నాయి. సీక్రెట్ ట్రిప్పులు.. కానుకలు, పరోక్షంగా సోషల్ మీడియా పోస్టులతో తొలినాళ్లలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యలో ఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం, విజయ్ నెగ్గాక స్వయంగా ఇంటికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పడం.. ప్రమాణ స్వీకారంలో త్రిష హడావిడి.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి ఈ హిట్ పెయిర్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు ఏ రేంజ్‌లో చెబుతుందో? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. అయితే.. ఇన్‌స్టాలో అన్‌ఫాలో కావడం, విషెస్ తెలియజేయకపోవడం.. విజయ్-సంగీత మధ్య రాజీ కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రావడం అప్పటిదాకా సాగిన చర్చను మరో దారి తీసుకెళ్లింది. విజయ్ త్రిష బ్రేకప్ అయ్యిందంటూ గాలి కబుర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్ పెడుతూ.. ఒక రోజు ఆలస్యంగా త్రిష విజయ్‌కి బర్త్‌డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే.. త్రిష షేర్ చేసిన విజయ్ కేక్ కటింగ్ ఫొటో పాతదా? కొత్తదా? అనేదానికి ఎలాంటి స్పష్టత లేదు