
టాలీవుడ్‌లో కొన్ని టాప్ బ్యానర్స్ ఉన్నాయి. వాటిలో వైజయంతీ మూవీస్ ఒకటి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ సంస్థకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. టాలీవుడ్‌లో కొన్ని టాప్ బ్యానర్స్ ఉన్నాయి. వాటిలో వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ఒకటి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ సంస్థకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. వైవిధ్యభరితమైన చిత్రాలతో అప్పుడెలా అయితే పేరుని తెచ్చుకుందో.. ఇప్పుడు కూడా ఆ పేరును నిలబెట్టుకోవడమే కాదు.. ఒక బ్రాండ్‌గా పిలుచుకునేలా ఈ సంస్థ మారిందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ విషయాలను పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఈ సంస్థ నుంచి వస్తోన్న చిత్రాలు ఎంతో వైవిధ్యతతో ఉండటం విశేషం. రొటీన్, రొట్ట సినిమాలు కాకుండా.. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ.. ఈ సంస్థ దూసుకెళుతోంది. కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందుకు కారణం యంగ్ జనరేషనే. ఒకే టైపు సినిమాలకు స్వస్తి పలుకుతూ.. సినిమాసినిమాకు వైవిధ్యతను కనబరుస్తూ.. క్రియేటివ్ ఫ్రీడమ్ గొప్పతనమేంటో ఈ సంస్థ తెలియజేస్తోంది. ఈ విషయంలో ఎన్నో సంస్థలకు ఈ సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మార్పు నాగ్ అశ్విన్‌తోనే మొదలైంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా ఇప్పుడు ఎంతో మందికి ఫేవరేట్ సినిమాగా ఉందంటే.. అందులో ఉన్న కంటెంట్‌తో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్‌కు ఈ సంస్థ ఇచ్చిన ఇంపార్టెన్సే అని చెప్పుకోవాలి. అప్పటి నుంచి వరసగా.. ‘మహానటి’, ‘జాతిరత్నాలు’, ‘సీతా రామం’, ‘కల్కి 2898 AD’.. ఇంకా రీసెంట్‌గా వచ్చిన ‘సింగ్ గీతం’. ఈ సినిమాలను గమనిస్తే.. వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర నిలబడిన చిత్రాలే. ఇవి కాకుండా ‘ఛాంపియన్’ వంటి మరో సంచలన చిత్రం కూడా ఈ బ్యానర్ నుంచే వచ్చింది. ఈ