
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas), సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ‘యానిమల్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందునా ప్రభాస్ తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ముందెన్నడూ లేనంత హైప్ ఈ సినిమాపై క్రియేట్ అయింది. ఈ క్రేజీ కాంబినేషన్ థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసాన్ని సృష్టిస్తుందోనని అటు ట్రేడ్ వర్గాలతో పాటు, ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన డ్యూటీ చేస్తున్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి, వంద శాతం అంకితభావంతో నటిస్తున్న సినిమా ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ‘బాహుబలి’ తర్వాత డార్లింగ్ చేసిన సినిమాలన్నీ ఎక్కువగా ఇండోర్ సెట్లలోనే షూటింగ్ జరుపుకున్నాయి. కానీ ‘స్పిరిట్’ కోసం మాత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పూర్తిగా రియల్ లొకేషన్లను ఎంచుకున్నారు. కథ డిమాండ్ మేరకు యాక్షన్ సన్నివేశాల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వాస్తవిక ప్రదేశాలలోనే చిత్రీకరణ జరుపుతూ.. సినిమాను ఒక రేంజ్‌లో తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతోంది. నగరంలోని అజీజ్ నగర్ పరిసరాల్లో ప్రభాస్ పాల్గొంటున్న కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరిస్తున్నారు. డార్లింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టడంతోనే అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా హీటెక్కిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు సందీప్ రెడ్డి వంగా మార్క్ రా, రస్టిక్ ఎలివేషన్స్.. మరోవైపు