వెంకయ్య నాయుడు ఆత్మకథ.. నిజాలు బయటపెడితే వారికి నచ్చదు
Actor ProfilePolitician

వెంకయ్య నాయుడు ఆత్మకథ.. నిజాలు బయటపెడితే వారికి నచ్చదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెంకయ్య నాయుడు ఆత్మకథ.. నిజాలు బయటపెడితే వారికి నచ్చదు
Oneindia Telugu12 Aug 2026
వెంకయ్య నాయుడు ఆత్మకథ.. నిజాలు బయటపెడితే వారికి నచ్చదు

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జీవిత విశేషాలను ప్రతిబింబించే వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం విజయవాడలో ఘనంగా జరిగింది. సీనియర్ తెలుగు జర్నలిస్ట్ శ్రీ మా శర్మ రచించిన ఈ పుస్తకాన్ని పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత పదవులను అధిరోహించిన వెంకయ్య నాయుడు గారి జీవన ప్రస్థానం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని రచయిత శ్రీ మా శర్మ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను పంచుకున్నారు. తాను ఆత్మకథ రాయకపోవడానికి గల కారణాన్ని మొదటిసారిగా వెల్లడించారు. తాను రాస్తే ఎన్నో నిజాలు బయటకు వస్తాయని, అవి చాలామందికి రుచించకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.నిజాలు చెబితే నచ్చని వారికి ఇబ్బందే..పుస్తకావిష్కరణలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, చాలామంది నన్ను ఆత్మకథ రాయమని అడిగారు. అయితే, నేను రాస్తే ఎన్నో నిజాలు బయటపెట్టాల్సి ఉంటుంది. ఆ నిజాలు చాలామందికి నచ్చకపోవచ్చు. అందుకే నేను ఆత్మకథ జోలికి వెళ్లలేదు. అయితే, నా జీవిత అనుభవాలు, పోరాటాలు నేటి తరానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే, మాశర్మ వచ్చి అడిగినప్పుడు ఆయనకు అంగీకరించాను అని పేర్కొన్నారు. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే అత్యున్నత పదవిని అలంకరించిన తన ప్రయాణాన్ని మాశర్మ అద్భుతంగా ఆవిష్కరించారని ఆయన ప్రశంసించారు. రాజకీయాల్లోకి నా బిడ్డల్ని రానివ్వను: వెంకయ్య నాయుడు సంచలన ప్రకటనఏపీ విభజనపై ఆసక్తికర వ్యాఖ్యలురాష్ట్ర విభజన అంశంపై స్పందిస్తూ వెంకయ్య నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన 2014 కంటే ముందే జరిగి ఉంటే.. రాష్ట్రం ఈపాటికి ఎంతో అభివృద్ధి చెందేది. కానీ, నాటి రాజకీయ కారణాల వల్ల ఆ అవకాశం దక్కలేదు. అందుకే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా నేను కేంద్ర స్థాయిలో పూర్తి