
దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతోంది. హీరో దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతోంది. సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విడుదలైన టీజర్, పాటలు కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో మంచి స్పందన దక్కింది. తల్లిదండ్రుల పట్ల బాధ్యత, కుటుంబ బంధాల ఆవశ్యకత, నేటి సమాజంలో మానవ సంబంధాల మారుతున్న పరిస్థితులను భావోద్వేగంగా చూపించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్రబృందం తెలిపింది. ముఖ్యంగా తండ్రి-పిల్లల అనుబంధం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటీవీ ప్రభాకర్, చాలా రోజుల తర్వాత హృదయాన్ని తాకే కథను విన్నానని చెప్పారు. కథ నచ్చడంతోనే తన కుమార్తె దివిజను ఈ చిత్రంలో నటించమని ప్రోత్సహించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల గొప్పతనాన్ని హృద్యంగా చూపించిన దర్శకుడు సతీష్ ఆవాలను ఆయన అభినందించారు. నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ, భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఈ సినిమాలో తనకు గుర్తుండిపోయే పాత్ర దక్కిందని తెలిపారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలు సినిమాలో ఉన్నాయని చెప్పారు. దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ, పెద్దల పట్ల గౌరవం, కుటుంబ విలువలను నేటి తరానికి గుర్తు చేసే ప్రయత్నమే