వీకెండ్ లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్
Actor ProfilePolitician

వీకెండ్ లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్

Total News1
Movie Updates0
Sources1
వీకెండ్ లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్ పై కవిత సెటైర్లు
Andhra Jyothy18 Jun 2026
వీకెండ్ లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్ పై కవిత సెటైర్లు

మాజీమంత్రి కేటీఆర్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు వీకెండ్‌లో వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి కేటీఆర్‌పై (KTR) తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు వీకెండ్‌లో వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ఈరోజు (గురువారం) సిరిసిల్లలో కవిత పర్యటించి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ రైతన్నల నడ్డి విరిస్తే కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. సిరిసిల్లలో సెస్ ఆగమాగం అయితే కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. రైతు డిస్కంలపై ఇప్పటి వరకు కేటీఆర్ ఎందుకు నోరెత్తలేదని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. రైతు డిస్కం కావాలో, వద్దో ఆయన ఎందుకు చెప్పలేదని నిలదీశారు. నేరెళ్లలో అక్రమ ఇసుక సంపాదన కోసం దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ధ్వజమెత్తారు. నేరెళ్ల బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పుకొచ్చారు. నేరెళ్ల ఇసుక బాధితుల తరపున కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కార్పొరేటర్‌గా వచ్చి.. నేరెళ్ల బాధితుల ఓట్లతో బండి సంజయ్ కేంద్రమంత్రి అయ్యారని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని