
రామ్ చరణ్ తన కెరీర్‌లో క్రీడాకారుడిగా చేసిన తొలి చిత్రం `పెద్ది`. తన ఊరు గుర్తింపు కోసం ఆట ద్వారా హీరో చేసిన పోరాటమే ఈ మూవీ. ఇందులో రామ్ చరణ్.. ఒక క్రికెటర్‌గా, ఒక కుస్తీ వీరుడిగా, మరోవైపు రన్నర్‌గా కనిపించాడు. మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశాడు. ఓ వైపు బాధ, మరోవైపు ఆవేదన, ఇంకోవైపు గెలవాలనే కసి ఆయనలో కనిపించాయి. హవభావాలతోనే ఎమోషన్స్ ని పలికించి మెప్పించాడు. విమర్శకుల ప్రశంసలందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే `పెద్ది` సినిమా బాక్సాఫీసు వద్ద మొదటి వారంలో మంచి వసూళ్లని రాబట్టింది. ఇక రెండో వారం కొంత డ్రాప్ ఉంది. సింగిల్ డిజిట్ నెంబర్లతో సత్తా చాటుతోంది. అయితే రెండో వారం వీక్ డేస్‌లో సినిమాకి వసూళ్లు తగ్గాయి. కానీ వీకెండ్‌లో పుంజుకోవడం విశేషం. ఇది టీమ్‌కి కొంత ఊపిరిపోసిన ఫీలింగ్ అని చెప్పొచ్చు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచాలను అందుకోవడం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కొంత డ్రై సినిమాగా నిలిచింది. ఇదే ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. హీరో పాత్రలో స్ట్రగుల్ ఉంది, కానీ ఎమోషన్స్ క్యారీ కాలేదని అనే టాక్ వినిపించింది. అదే సమయంలో సినిమా అదిరిపోయిందని మెగా అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఇలాంటి మిశ్రమ స్పందనతో రన్ అవుతున్న `పెద్ది` సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుంది. మరి 11 రోజుల్లో ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, రెండు వారాల్లో ఈ మూవీ మూడు వందల కోట్ల మైల్ స్టోన్‌ని దాటేసింది. ఇప్పటి వరకు దీనికి రూ.307.98(308)కోట్లు వసూలు చేసింది. ఈ శనివారానికి ఈ మూవీ రూ.8.10కోట్లు రాబడితే, ఆదివారం 9.20కోట్లు సాధించింది. ఇది కేవలం ఇండియాలో మాత్రమే. ఇది సినిమాకి పెరిగిన ఆదరణకి నిదర్శనంగా చెప్పొచ్చు. `పెద్ది` మూవీకి ఇండియాలో రూ.256కోట్ల గ్రాస్