విక్టరీ కోసం వెంకీ కొత్త గేమ్ ప్లాన్
Actor ProfileActor

విక్టరీ కోసం వెంకీ కొత్త గేమ్ ప్లాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విక్టరీ కోసం వెంకీ కొత్త గేమ్ ప్లాన్
Telugu Times6 Aug 2026
విక్టరీ కోసం వెంకీ కొత్త గేమ్ ప్లాన్

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో మరో ఆసక్తికర దశలోకి అడుగుపెడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఫ్యామిలీ ఓరియెటెడ్ సినిమాల‌తో ఎన్నో విజయాలు అందుకున్న వెంకటేష్, ఈసారి ఒక్క జోనర్‌కే పరిమితం కాకుండా విభిన్న శైలుల్లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌లను సమతూకంగా ఎంచుకుంటూ స్ట్రాంగ్ లైనప్‌ను సిద్ధం చేస్తున్నారనే సమాచారం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్లాన్ సక్సెస్ అయితే వెంకటేష్ కెరీర్‌లో మరో స్పెష‌ల్ చాప్ట‌ర్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ లైనప్‌లో ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఆదర్శ కుటుంబం కీలక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఫ్యామిలీ బాండింగ్స్, ఎమోష‌న్స్, త్రివిక్రమ్‌కు ప్రత్యేకమైన సంభాషణలతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి స్థాయి కామెడీ మల్టీస్టారర్ ఇప్పటికే ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత వశిష్ట దర్శకత్వంలో భారీ స్థాయిలో యాక్షన్ డ్రామా తెరకెక్కనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, మాస్ ఆడియ‌న్స్ ను టార్గెట్ గా చేసుకుని బాబీ కొల్లి దర్శకత్వంలో మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు కూడా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకే సమయంలో నాలుగు విభిన్న జోనర్లలో సినిమాలను ప్లాన్ చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్స్ వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ లైనప్‌లోని ప్రతి సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటే, వెంకటేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి