లవ్ జిహాద్ కలకలం..? హోమ్ స్టేలో శవమైన సాయి సురభి.. ప్రియుడి కోసం పోలీసుల నిఘా
Actor ProfilePolitician

లవ్ జిహాద్ కలకలం..? హోమ్ స్టేలో శవమైన సాయి సురభి.. ప్రియుడి కోసం పోలీసుల నిఘా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లవ్ జిహాద్ కలకలం..? హోమ్ స్టేలో శవమైన సాయి సురభి.. ప్రియుడి కోసం పోలీసుల నిఘా
Zee Telugu26 Aug 2026
లవ్ జిహాద్ కలకలం..? హోమ్ స్టేలో శవమైన సాయి సురభి.. ప్రియుడి కోసం పోలీసుల నిఘా

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Chikkaballapur Homestay Surabhi Death: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఒక హోమ్ స్టేలో యువతి మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. మృతురాలిని సాయి సురభి (26)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, ఆమె ప్రియుడు మహమ్మద్ సంజిత్‌ అలీ ఆమెను హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సురభి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా తన కూతురిని అతను వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. సురభి మృతదేహం వద్ద అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితిలో ఉండటంతో, పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం, సాయి సురభి కర్ణాటకలోని అడియార్ జిల్లాకు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. క్యాబ్ బుక్ చేసుకుంటున్న సమయంలో కేరళకు చెందిన మహమ్మద్ సంజిత్‌ అలీ ఆమెకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత వీరు బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో కలిసి ఉంటున్నారు. అయితే సంజిత్‌ అలీ తన కూతురికి మద్యం, మత్తు పదార్థాలు అలవాటు చేశాడని సురభి కుటుంబం ఆరోపిస్తోంది. 26 ఏళ్ల సురభి బెంగళూరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్. తన కూతురిది కచ్చితంగా లవ్‌ జిహాదే అని మృతురాలి తల్లి ఆరోపించారు. 'నా కూతురు ఎక్కడికి వెళ్లినా అతను వెంటాడి వేధించేవాడు. అతను నన్ను చంపేస్తాడని, వేరే పెళ్లి చేసి నన్ను దూరం చేయాలని పదే పదే భయపడుతూ చెప్పేదని సురభి తల్లి కన్నీరుమున్నీరయింది. ఇంతలోనే తనకు తెలియకుండా , ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తన కుమార్తెను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని