
Iran -Trump : అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్నట్లు చెప్తున్న పీస్ డీల్‌లో ఇరాన్ పైచేయి సాధించిందంటూ వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా


Iran -Trump : అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్నట్లు చెప్తున్న పీస్ డీల్‌లో ఇరాన్ పైచేయి సాధించిందంటూ వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా

PM-VBRY : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం-వీబీఆర్‌వై (PM-VBRY) పథకం లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం కింద అర్హులైన వారి కోసం ఏకంగా ₹2,400 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం, నిబంధనల మేరకు తొలిసారిగా ఉద్యోగంలో చేరి, ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి వచ్చే కొత్త ఉద్యోగులకు నెల వేతనంగా గరిష్టంగా ₹15,000 వరకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందనుంది. అలాగే సదరు ఉద్యోగిని చేర్చుకున్న యాజమాన్యానికి సైతం ₹3,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ లబ్ధి అంతా రెండు విడతల్లో నేరుగా ఉద్యోగి ఖాతాకే జమ కానుంది. 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి 2027 జులై 31వ తేదీ లోపు కొత్తగా వచ్చే ఉద్యోగ నియామకాలన్నింటికీ ఈ ఆర్థిక ప్యాకేజీ వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. Read Also : అయోధ్య రామమందిరం విరాళాల స్కాంపై సీఎం యోగి వార్నింగ్ కరోనా తదనంతర కాలంలో మరియు మారుతున్న ఆర్థిక సమీకరణాల నేపథ్యంలో దేశంలో ఫార్మల్ సెక్టార్ (వ్యవస్థీకృత రంగం) లో ఉద్యోగాల కల్పనను వేగవంతం చేయడానికి ఈ పథకం ఒక గేమ్ చేంజర్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం, ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది యువత లబ్ధి పొందినట్లు అధికారికంగా వెల్లడైంది. కంపెనీలు కొత్త సిబ్బందిని చేర్చుకోవడానికి వెనుకాడుతున్న సమయంలో, యజమానులకు కూడా ఆర్థిక భారాన్ని తగ్గించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. యువతకు తొలి ఉద్యోగ అవకాశాలు పెంచడంతో పాటు, వారిని ఈపీఎఫ్ఓ వంటి సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడంలో పీఎం-వీబీఆర్‌వై పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. Telangana Voter List Verification: జూన్ 25 నుంచి తెలంగాణలో ఇంటింటి ఓటర్ సర్వే గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన