లగ్జరీ రిసార్ట్ గా రుషికొండ ప్యాలెస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల
Actor ProfilePolitician

లగ్జరీ రిసార్ట్ గా రుషికొండ ప్యాలెస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లగ్జరీ రిసార్ట్ గా రుషికొండ ప్యాలెస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల
10TV Telugu7 Sept 2026
లగ్జరీ రిసార్ట్ గా రుషికొండ ప్యాలెస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల

రుషికొండ భవనాల లీజుకు నోటిఫికేషన్ నెలకు ఇరవైఐదు లక్షల భారం లగ్జరీ రిసార్ట్‌గా మార్చే ప్రతిపాదన Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.450 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాజకీయ వివాదాలు, న్యాయపరమైన చిక్కుల వల్ల రెండేళ్లుగా ఈ భవనాలు వృథాగా పడి ఉండటంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. నిర్వహణ భారం.. లగ్జరీ రిసార్ట్‌గా మార్చే ప్రణాళిక: ఈ భవనాలు వినియోగంలో లేకపోవడం వల్ల దెబ్బతినడమే కాకుండా, వీటి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.25 లక్షల వరకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భవనాల(Rushikonda Buildings) భవిష్యత్తుపై అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. ఈ విలాసవంతమైన నిర్మాణాలను ఒక అంతర్జాతీయ స్థాయి 'లగ్జరీ రిసార్ట్'గా అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి భారీగా ఆదాయం రావడంతో పాటు ప్రభుత్వానికి నిర్వహణ భారం తప్పుతుందని సూచించింది. ఈ సిఫారసుల ఆధారంగానే లీజు ప్రక్రియ వేగవంతమైంది. పెట్టుబడిదారుల ఆసక్తి.. కొనసాగుతున్న న్యాయ వివాదాలు వాతావరణ శాఖ: ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాజెక్టుపై పలువురు ప్రైవేట్ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, రిసార్ట్ సామర్థ్యాన్ని పెంచేందుకు అదనపు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని వారు కోరుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఉండటం, జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు కోర్టుల్లో కూడా కేసులు పెండింగ్‌లో ఉండటంతో అదనపు అనుమతులపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ లీగల్ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే