
శంషాబాద్: కౌలాలంపూర్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న శంషాబాద్ విమానాశ్రయంలో ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యాపారి వ్యక్తిగత పనుల కోసం మలేసియాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో 374 గ్రాముల బంగారాన్ని లగేజీలో పెట్టుకుని ఎయిర్ ఆసియా ఎయిర్‌లైన్స్ ఏకే-69 విమానంలో ఎక్కి శంషాబాద్‌లో దిగాడు. ఆయన ప్రవర్తనపై అనుమానం రావడంతో భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. లగేజీలో దొరికిన సుమారు రూ.55 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకాక్ వెళ్లాడు. వియత్నాం మీదుగా స్వదేశానికి వస్తున్న క్రమంలో 7.118 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని సామగ్రిలో పెట్టుకున్నాడు. క్యాథే పసిఫిక్ ఎయిర్‌లైన్స్ సీఎక్స్-673 విమాన సర్వీస్‌లో ఎక్కి శంషాబాద్‌లో దిగాడు. అతని ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. లగేజీలో పట్టుబడిన రూ.2.49 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్‌లో వివిధ హోటళ్లపై టాస్క్ ఫోర్స్ ఆహార కల్తీ నిఘా విభాగం పోలీసులు తనిఖీలు చేపట్టారు. కీలకాంశాలపై చర్చించేందుకు తెలంగాణ సీఎం, మంత్రులు అనధికారిక కేబినెట్ భేటీ తరహాలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) భక్తిపారవశ్యంలో