
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా ఇప్పటివరకు 330 కోట్ల (ప్రపంచవ్యాప్తంగా) రేంజ్ లో వసూళ్లు చేసింది. కొన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన డబ్బులు వచ్చాయి. మరికొన్ని ఏరియాల్లో చాలా నష్టాలు వచ్చాయి. ఓవరాల్ గా 330 కోట్లు వసూళ్లు చెయ్యడమే పెద్ద అఛీవ్ మెంట్. ఐతే, ఈ సినిమా టీం మాత్రం “పెద్ది” 420 కోట్లు వసూళ్లు సాధించింది అని చెప్పుకుంటోంది. సరే నిర్మాత చెప్పినా తప్పులేదు. కానీ ఈ సినిమాలో పాట రాసిన వ్యక్తికీ వసూళ్ల గురించి ఎందుకు? రికార్డుల ఊసు ఎందుకు? అనంత శ్రీరామ్ (Anantha Sriram) తాజాగా ఈ సినిమా 420 కోట్ల సినిమా అంటూ స్టేజ్ పై ప్రకటించాడు. ఈ రోజు (జూన్ 23) జరిగిన పెద్ది విజయోత్సవ సంబరాల్లో పాల్గొని ఈ రికార్డు చెప్పాడు. అంతే కాదు, సినిమాని కావాలని కొందరు తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించారు అంటూ వరద బురద దురద అంటూ సిల్లీగా ఎదో ఎదో మాట్లేడేశాడు. పాటలు రాసుకోకుండా వసూళ్ల గురించి, ఫ్యాన్స్ వార్ గురించి అనంత శ్రీరామ్ కి ఎందుకు? పెద్ది 420 కోట్ల సినిమా. వసూళ్ల వరద. ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్ల సరదా తీర్చేసిన అభిమానులు మీరు,” అంటూ మాట్లాడాడు. వరద మీద బురద ఎలా జల్లుతారు బాసూ? ఏంటి ప్రాస ప్రయాస?