లోనూ ఊహించని మార్పులు! ఒకేసారి ఎంత పెరుగుతుందంటే
Actor ProfilePolitician

లోనూ ఊహించని మార్పులు! ఒకేసారి ఎంత పెరుగుతుందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లోనూ ఊహించని మార్పులు! ఒకేసారి ఎంత పెరుగుతుందంటే
Oneindia Telugu6 Aug 2026
లోనూ ఊహించని మార్పులు! ఒకేసారి ఎంత పెరుగుతుందంటే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎదురుచూస్తున్న '8వ వేతన సంఘం' (8th Pay Commission) వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా తమ జీతాలు పెరగాలని సుమారు 55 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ వేతన సవరణలో అత్యంత కీలకమైన అంశం 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్'. ఇది ఉద్యోగుల బేసిక్ పే (ప్రాథమిక వేతనం)ను నిర్ణయించడంలో కీలకంగా మారనుంది. ప్రస్తుతం 8వ వేతన సంఘం వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2 రెట్ల నుంచి ఏకంగా 5 రెట్ల వరకు పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం తన ఆర్థిక సామర్థ్యం, పెన్షన్ల భారం మరియు బకాయిల చెల్లింపులను పరిగణనలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ప్రభుత్వ వర్గాల్లో 2x నుంచి 3x వరకు ఫిట్‌మెంట్ పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు, ప్రస్తుతం 25,500 రూపాయల ప్రాథమిక వేతనం పొందుతున్న లెవెల్-4 ఉద్యోగి జీతాన్ని మనం పరిశీలిస్తే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా రేపటి రోజున వారి బేసిక్ పే ఏ విధంగా మారుతుందో అంచనా వేయవచ్చు. వేర్వేరు ఫిట్‌మెంట్ లెక్కల ప్రకారం వచ్చే సవరించిన ప్రాథమిక వేతన వివరాలు ఈ కింది పట్టిక రూపంలో పరిశీలించవచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది నేరుగా అలవెన్సులపై వర్తించకపోయినప్పటికీ, అది ప్రాథమిక వేతనాన్ని భారీగా పెంచుతుంది. బేసిక్ పే పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ఇంటి అద్దె భత్యం (HRA) కూడా మారుతుంది. ఎందుకంటే హెచ్‌ఆర్‌ఏ ఎల్లప్పుడూ బేసిక్ పే శాతంగా మాత్రమే లెక్కించబడుతుంది. కాబట్టి 8వ వేతన సంఘం కింద కొత్త బేసిక్ పే అమల్లోకి రాగానే ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ కూడా అంచనాలకు తగ్గట్టుగా పెరుగుతుంది. ఏడో వేతన సంఘం మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ