
‘మంచం మీదే ఉండి చనిపోతే నన్ను నిస్సహాయురాలిగా గుర్తుంచుకుంటారు.. కానీ నాట్యం చేస్తూ చనిపోతే దిగ్గజంగా గుర్తుండిపోతాను’ అంటూ ప్రసవానంతరం.. కాలికి గజ్జెకట్టి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది ఓ జానపద కళాకారిణి. మరి ఆమె కథేంటో తెలియాలంటే ‘ఈథ’ సినిమా చూడాల్సిందే. బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని ‘ఛావా’ ఫేమ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘తుపాను నాట్యం చేయడం చూడాలనుకుంటే.. ఈథని చూడాల్సిందే’ అంటూ ఈ సినిమా టీజర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. లాంతర్ల వెలుగులో శ్రద్ధ హావభావాలతో కూడిన నృత్య సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని మహారాష్ట్రలోని ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయి జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు