లండన్ వీధుల్లో పెద్ది’ సక్సెస్ హంగామా... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఘన స్వాగతం
Actor ProfileActor

లండన్ వీధుల్లో పెద్ది’ సక్సెస్ హంగామా... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఘన స్వాగతం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లండన్ వీధుల్లో పెద్ది’ సక్సెస్ హంగామా... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఘన స్వాగతం
Samayam Telugu7 Aug 2026
లండన్ వీధుల్లో పెద్ది’ సక్సెస్ హంగామా... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఘన స్వాగతం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 4వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రారంభంలో కొన్ని చోట్ల మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆ తర్వాత అద్భుతమైన మౌత్ టాక్‌తో పుంజుకుని వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించగా.. త్వరలోనే థియేట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.* రిలీజ్‌కి ముందే ‘నాగబంధం’ సంచలనం.. హాట్ కేకుల్లా అమ్ముడైన థియేట్రికల్ రైట్స్ హైదరాబాద్‌లో ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించిన అనంతరం, చిత్ర యూనిట్ బ్రిటన్‌లోనూ ప్రత్యేక సంబరాలకు ప్లాన్ చేసింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో, ముఖ్యంగా లండన్‌లో ‘పెద్ది’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి అభిమానులను స్వయంగా కలుసుకుని, సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు రామ్ చరణ్ లండన్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో మెగా వెల్‌కమ్రామ్ చరణ్ లండన్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం.. అక్కడ భారీ సంఖ్యలో వేచి ఉన్న ప్రవాసాంధ్రులు, స్థానిక అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సూట్ ధరించి, స్టైలిష్ గ్లాసెస్‌తో మెరిసిపోతున్న చరణ్‌ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. లండన్‌లోని హన్స్‌లో ఉన్న ప్రసిద్ధ సినీవరల్డ్ థియేటర్లో జరిగిన ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్‌కు రామ్ చరణ్ స్వయంగా హాజరయ్యారు. అక్కడ ప్రేక్షకులతో కలిసి థియేటర్లో కాసేపు సినిమాను వీక్షించి, వారి ఆనందాన్ని పంచుకున్నారు. లండన్ వీధుల్లోనూ, థియేటర్ ప్రాంగణంలోనూ మెగా అభిమానులు చేసిన సందడి, రామ్ చరణ్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.* నాగ్ అశ్విన్ ఆఫర్‌ను