
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి.. 45 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఎంతో కష్టపడి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. ఆయన కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా చేశారు. ఒక్కోసారి స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి.. చిరంజీవి లేడీ క్యారెక్టర్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు ఏదో ఒక సందర్భంలో లేడీ పాత్రలు చేసిన వారే. అయితే చిరంజీవి పెళ్లైన తరువాత ఓ సినిమాలో మీసం తీసేసి, ఫారెన్ గౌను వేసుకుని.. సాంగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చిరంజీవి రెండు సినిమాల్లో పలు సందర్భాల్లో లేడీ గెటప్ లో కనిపించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయ్ మూవీలో మెగాస్టార్ ఓ డిటెక్టీవ్ పాత్రలో కనిపించారు. డిటెక్టివ్ పాత్రలో నటిస్తూ విభిన్న గెటప్స్ వేశారు. ఇందులో భాగంగానే ఒక సీన్, సాంగ్ లో గౌను, తలపై టోపీ ధరించి లేడీ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. అంతే కాదు అంతకు ముందు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో కూడా మోహన్ బాబుతో కలిసి లేడీ గెటప్ వేసుకుని కనిపించాడు చిరంజీవి. అయితే చంటబ్బాయి సినిమా టైమ్ లో మాత్రం మెగాస్టార్ తన ఇంట్లో తిట్లు తినాల్సి వచ్చిందట. లేడీ గెటప్ గురించి ఓ సినిమా ఈవెంట్ లో చిరంజీవి డైరెక్ట్ కామెంట్స్ చేశారు. చంటబ్బాయిలో ఆ క్యారెక్టర్ నాకు సెట్ కాలేదని నా కుటుంబసభ్యులు అన్నారు. అలా నన్ను చూడలేకపోయారు. అమ్మ అంజనమ్మ అయితే ఏంటిరా ఇది అని తిట్టారు.. ఇక సురేఖ అయితే.. మళ్లీ మీసాలు పెంచేవరకు కంటికి కనిపించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది అంటూ ‘చంటబ్బాయి’ సంగతులు గుర్తుచేసుకున్నారు చిరంజీవి. లేడీ గెటప్ కోసం మీసాలు తీయాల్సి వచ్చినప్పుడు, చిరంజీవి దర్శకుడు