లీగల్ వివాదంలో ప్రభాస్ స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా
Actor ProfileActor

లీగల్ వివాదంలో ప్రభాస్ స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లీగల్ వివాదంలో ప్రభాస్ స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా
Chitrajyothy13 Jul 2026
లీగల్ వివాదంలో ప్రభాస్ స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ ఇప్పుడు లీగల్ కాంట్రవర్సీని ఫేస్ చేయబోతోంది. ‘స్పిరిట్ - ఈజ్ నాట్ వన్’ టీమ్ సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), సంచలన దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit) ఇప్పుడు లీగల్ కాంట్రవర్సీని ఫేస్ చేయబోతోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ సినిమా టైటిల్ కాంట్రవర్సీని ఫేస్ చేస్తోంది. కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ‘స్పిరిట్ - ఈజ్ నాట్ వన్’ (Spirit Is Not One) అనే చిన్న సినిమా నిర్మించిన నిర్మాతలు.. ప్రభాస్ ‘స్పిరిట్’ టైటిల్‌ విషయంలో పోరాడేందుకు కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా అంత దూరం వస్తే మాత్రం.. ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రానికి టైటిల్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన మహిళా నిర్మాత నరసమ్మ తన గొర్రెలు, మేకలు, ఆస్తులను అమ్మి.. ఎంతో కష్టపడి ‘స్పిరిట్ - ఈజ్ నాట్ వన్’ సినిమాను నిర్మించామని చెబుతున్నారు. ఇందులో నిర్మాత నరసమ్మ తనయుడు రవి హీరోగా నటించారు. సందీప్ రెడ్డి వంగా అండ్ టీమ్ ‘స్పిరిట్’ టైటిల్‌ని రిజిస్టర్ చేయడానికి రెండు నెలల ముందే ‘స్పిరిట్ - ఈజ్ నాట్ వన్’ అనే టైటిల్‌ని ఛాంబర్‌లో అధికారికంగా రిజిస్టర్ చేశామని నిర్మాత నరసమ్మ, హీరో రవి చెబుతున్నారు. అయినా కూడా టీ - సిరీస్ వారు టైటిల్ మాదంటూ.. లీగల్ నోటీసులు పంపించారని, టైటిల్ మార్చమని చెబుతూ.. మా సినిమాను విడుదల కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ విషయంలో లీగల్ పోరాటానికి సిద్ధమైనట్లుగా కూడా వారు