
TG-20 లీగ్ రెండో రోజే బ్యాటింగ్ ఉత్సవంతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ లీగ్‌లో రెండో రోజే రెండు అద్భుతమైన సెంచరీలు నమోదు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చాయి. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ మైదానంలో పూనకాలతో ఊగిపోతూ వరంగల్ బౌలర్లను దంచికొట్టాడు. శ్రీలంక నుంచి నేరుగా వచ్చిన తిలక్ వర్మ ఏమాత్రం అలసట లేకుండా ఇంత పెద్ద ఇన్నింగ్స్ ఆడడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ టీమ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు బోర్డుపై పెట్టింది. వరంగల్ బ్యాటర్ అమన్ రావు పేరాల కేవలం 48 బాల్స్‌లోనే 142 పరుగులు చేసి అద్భుతం సృష్టించాడు. అమన్ రావు విధ్వంసకర ఇన్నింగ్స్ చూసి వరంగల్ వారియర్స్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉండగా మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణించి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 259 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్ టీమ్‌ను తిలక్ వర్మ ఒంటిచేత్తో నడిపించాడు. తిలక్ వర్మ కేవలం 56 బాల్స్‌లోనే 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 136 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా మెదక్ ఫాల్కన్స్ వైపు తిరిగిపోయింది. ఈ నేపథ్యంలో మెదక్ ఫాల్కన్స్ బ్యాటర్ విక్రమ్ నాయక్ లేట్ ఫైర్‌వర్క్స్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా ముగించాడు. విక్రమ్ నాయక్ మెరుపులు మెరిపించడంతో మెదక్ ఫాల్కన్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది. 3 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించి టోర్నీలో సంచలనం సృష్టించింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో చేజింగ్ చూసిన ప్రేక్షకులు తిలక్ ఆటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇదే లీగ్‌లో జరిగిన ఇంకొక మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్