లింగం' జియో హాట్ స్టార్ సిరీస్ రివ్యూ
Actor ProfileActor

లింగం' జియో హాట్ స్టార్ సిరీస్ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లింగం' జియో హాట్ స్టార్ సిరీస్ రివ్యూ
AP7AM7 Aug 2026
లింగం' జియో హాట్ స్టార్ సిరీస్ రివ్యూ

తమిళంలో తాజాగా రూపొందిన ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చింది. మాఫియా నేపథ్యంలో సాగే ఆ సిరీస్ పేరే 'లింగం'. కథిర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, లక్ష్మీ శరవణ కుమార్ దర్శకత్వం వహించాడు. 8 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్, ఈ నెల 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 'జియో హాట్ స్టార్' లో తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.'కన్యాకుమారి'లో ఫిషింగ్ హార్బర్ ల చుట్టూ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. 'కడప్పురం' పరిథిలో చెల్ల పాండియన్, 'నాగర్ కోయిల్' పరిథిలో సామియప్పన్ చక్రం తిప్పుతుంటారు. ఒకరి ప్రాంతంపై ఒకరు పట్టు సాధించడం కోసం .. ఒకరి ఏరియాలో ఒకరు అక్రమ వ్యాపారాలు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇరువైపులా అనుచరులు శవాలుగా మారుతూ ఉంటారు.అదే ప్రాంతంలో ముత్తులింగం (కథిర్) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ కావాలనేది ఆయన ఉద్దేశం. స్పోర్ట్స్ కోటాలోనైనా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో, 'కబడ్డీ' ఆడుతూ ఉంటాడు. లింగంతో పోటీగా కబడ్డీ ఎవరూ ఆడలేరనే ఒక టాక్ ఆ ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది. అతని ఆట తీరు .. నలుగురికీ సాయం చేసే మంచి మనసు చూసి, 'మలార్' (దివ్యభారతి) మనసు పారేసుకుంటుంది. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు.ఆ ఊర్లో ప్రతి ఏడాది జాతర సందర్భంలో కబడ్డీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంటుంది. ఆ సమయంలో ముఠా తగాదాలు జరగడం .. అనుచరులు చనిపోతుండటం జరుగుతుంటుంది. ఆ ఏడాది 'గుణశీలన్' అనే రౌడీని 'మార్టిన్' అనే రౌడీ హత్య చేస్తాడు. అయితే సరిగ్గా ఆ ప్రదేశంలో ముత్తులింగం ఉన్న కారణంగా, అతనే గుణశీలన్ ను హత్య చేసి ఉంటాడని అంతా భావిస్తారు. ఫలితంగా అతను కటకటాల పాలవుతాడు.అయితే 'చెల్లదురై' . 'తిరు'