ల క
Actor ProfilePolitician

ల క

📊 Box Office Collections
Total News10
Movie Updates0
Sources5
లోకో పైలట్ నెల జీతం ఎంతో తెలుసా? రోజుకు ఎంతసేపు పని చేస్తారు
Asianet News Telugu9 Jul 2026
లోకో పైలట్ నెల జీతం ఎంతో తెలుసా? రోజుకు ఎంతసేపు పని చేస్తారు

లోకో పైలట్ జీతం విషయానికి వస్తే, భారతీయ రైల్వేలో ఉద్యోగం స్థాయి, అనుభవం, పని చేసే విభాగం ఆధారంగా వేతనం మారుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ఉద్యోగంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సంఘం ప్రకారం ప్రారంభ బేసిక్ పే సుమారు రూ.19,900 ఉంటుంది. దీనికి డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటి భత్యాలు అదనంగా లభిస్తాయి. ఈ అలవెన్స్‌లన్నీ కలిపితే అసిస్టెంట్ లోకో పైలట్ నెలకు సుమారు రూ.35,000 నుంచి రూ.55,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ పదోన్నతులు ఉంటాయి. తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్, సీనియర్ లోకో పైలట్ వంటి పై స్థాయికి చేరుకోవచ్చు. పూర్తిస్థాయి లోకో పైలట్‌గా పనిచేసే వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.1 లక్షకు పైగా వేతనం లభించవచ్చు. కొన్ని ప్రత్యేక మార్గాలు, అదనపు డ్యూటీలు, నైట్ షిఫ్ట్‌లు, ఓవర్‌టైమ్ పనుల వల్ల ఆదాయం మరింత పెరుగుతుంది. అనుభవజ్ఞులైన సీనియర్ లోకో పైలట్ల వేతనం కొన్ని సందర్భాల్లో లక్ష రూపాయలు దాటుతుంది. లోకో పైలట్ కావాలంటే ఇంటర్ తర్వాత సంబంధిత టెక్నికల్ కోర్సులు లేదా ఐటీఐ, డిప్లొమా అర్హతలు ఉండాలి. తర్వాత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాలి. రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే ఎంపిక జరుగుతుంది. అయితే ఈ ఉద్యోగం వల్ల జీతం ఎక్కువొచ్చినా...ఇదొక బాధ్యతాయుతమైన జాబ్. గంటల తరబడి కేబిన్‌లో ప్రయాణించాలి. వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. టైమింగ్స్ ఉంటాయి. అయినప్పటికీ మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాల కారణంగా లోకో పైలట్ ఉద్యోగానికి యువతలో మంచి డిమాండ్ ఉంది. అందుకే రైల్వేలో కెరీర్‌ను నిర్మించాలనుకునే వారికి లోకో పైలట్ ఉద్యోగం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవకాశాల్లో ఒకటి అని చెప్పొచ్చు

లోకేష్ ఆగ్రహం..! గంటల్లోనే పవన్ కీలక నిర్ణయం
Oneindia Telugu6 Jun 2026
లోకేష్ ఆగ్రహం..! గంటల్లోనే పవన్ కీలక నిర్ణయం

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా పనిచేసి, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూ, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు మధ్య అనుబంధం పలుమార్లు బహిరంగంగానే కనిపిస్తుంటుంది. కానీ ఓ విషయంలో...

ఏపీలో దారుణం.. ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి.. లోకో పైలట్ కి తీవ్రగాయాలు
Oneindia Telugu5 Jun 2026
ఏపీలో దారుణం.. ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి.. లోకో పైలట్ కి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గురువారం రాత్రి తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ (GT) ఎక్స్‌ప్రెస్‌పై గుర్తుతెలియని దుండగులు రాళ్లు, భారీ

లిక్కర్ కేసులో జగన్ కు నోటీసులు, అనూహ్య మలుపు
Oneindia Telugu5 Jun 2026
లిక్కర్ కేసులో జగన్ కు నోటీసులు, అనూహ్య మలుపు

ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. పలువురిని సెట్ విచారణ చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలుతో ఈడీ సైతం నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగిస్తోంది. లిక్కర్ కేసులో నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. ఇక, ఇప్పుడు నేరుగా మాజీ సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. విచారణలో ఆయన సన్నిహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ నోటీసులు ఇవ్వటానికి సిద్దమైనట్లు సమాచారం.ఏపీ మద్యం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ కీలక దశకు చేరింది. ఈ కేసులో అంతిమంగా ఎవరు లబ్ది పొందారనే అంశం తేల్చేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా మాజీ సీఎం జగన్ ను విచారణ చేసేందుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అనేక మందిని విచారణ చేసింది. వారి వాంగ్మూలాలు నమోదు చేసారు. నిందితులు చెప్పిన వివరాలు.. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ కేసులో విచారణ పూర్తి చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం .అందులో భాగంగా చివరిగా ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను విచారణ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ చేసిన సిట్ అధికారులు ఇప్పటికే 350 పేజీల ఛార్జ్ షీటు దాఖలు చేసింది. అందులో జగన్ అంతిమ లబ్ది దారుగా సిట్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి.చంద్రబాబు, విజయ్ ను అధిగమించిన డీకే శివకుమార్ - దేశంలోనే నెంబర్ ఒన్..!!అంతిమ లబ్దిదారుని తేల్చేలా కసరత్తు కాగా, ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలువురిని విచారణ చేసింది. సిట్ నుంచి వివరాలను తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిందితుల ఆస్తులను కూడా సీజ్ చేశారు. రాజ్ కసిరెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, భారతీ సిమెంట్‌ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, తిరుపతిలోని వారి నివాసాలతోపాటు కార్యాలయాల్లో ఈ తనిఖీలు ఈడీ అధికారులు చేపట్టారు. కాగా.. ఈ సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు తదుపరి చర్యలకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మాజీ సీఎం జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కు ఈడీ నోటీసులు జారీ చేస్తే.. మాజీ సీఎం స్పందన.. తరువాతి పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది

వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు
TV9 Telugu3 Jun 2026
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు

రైలు హారన్ సౌండ్ వినపడగానే ఎవరికైనా గుండెలదురుతాయి. ఎంతటివారైనా సరే భయంతో రైలు పట్టాలకు దూరంగా జరుగుతారు. కానీ ముంబైలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా రైలు ముందే.. అది కూడా పట్టాలపై

లైకులతో వేట.. ఉగ్రవాద బాట
Eenadu1 Jun 2026
లైకులతో వేట.. ఉగ్రవాద బాట

హైదరాబాద్‌: పోస్టు నచ్చిందని లైక్‌ కొడితే పాతాళానికి జారిపోయే ప్రమాదం ఉంది. అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా స్పందిస్తే ఉగ్రవాదం కోరల్లో చిక్కుకునే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసపెట్టి జరుగుతున్న ఘటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. భావసారూప్యం ఉన్నవారిని గుర్తించేందుకు ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల మాటున విసురుతున్న వలలో చిక్కుకొని అమాయకులు విలవిల్లాడుతున్నారు. పూర్తి కథనం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

కట్టెల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మహిళలు
Vaartha31 May 2026
కట్టెల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మహిళలు

Nandigama Train Accident: నందిగామ, మే 31: బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతం నుండి వచ్చిన ఆ ఇద్దరు వలస మహిళల జీవితాలు రైలు ప్రమాదం రూపంలో అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఆదివారం సెలవు దినం

లుక్ మార్చిన విజయ్-సీఎం అయ్యాక తొలిసారి ఇలా
Oneindia Telugu29 May 2026
లుక్ మార్చిన విజయ్-సీఎం అయ్యాక తొలిసారి ఇలా

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (Vijay)తొలిసారి వస్త్రధారణ మార్చారు. తమిళనాడు రాజకీయాల్లో సంప్రదాయ వస్త్రధారణ అయిన పంచె కట్టును కాదని బ్లేజర్ సూట్ లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి హాజరైన విజయ్.. ఆ తర్వాత కూడా అదే స్టైల్ కొనసాగిస్తున్నారు. కానీ ఇవాళ ఉన్నట్లుండి విజయ్ తన వస్త్రధారణ మార్చేశారు. ఇన్నాళ్లుగా వేసుకుంటున్న బ్లేజర్ సూట్ స్ధానంలో తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణ అయిన పంచెకట్టుకు వచ్చేశారు. దీంతో విజయ్ కొత్తగా కనిపిస్తున్నారు. సీఎం విజయ్ ఇవాళ రాష్ట్రంలోని పలువురు ఉన్నతాధికారుల్ని కలుసుకున్నారు. వీరిలో కొత్తగా నియామకాలు పొందిన వారు కూడా ఉన్నారు. వీరితో కలిసి విజయ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందులో తమిళనాడు సంప్రదాయ పంచె కట్టులో కనిపించారు. ఎప్పుడూ బ్లేజర్ లో కనిపించే విజయ్.. ఇలా పంచె కట్టులో కనిపించే సరికి అధికారులు కూడా కొత్తగా చూస్తున్నట్లు ఇందులో కనిపించింది. అయితే విజయ్ మాత్రం ఎప్పటిలాగే తన చిరునవ్వుతో కనిపించారు. తమిళనాడులో దశాబ్దాలుగా రాజకీయ నేతలు ఇలా పంచె కట్టులోనే కనిపిస్తుంటారు. చట్టసభలకు వెళ్లినా, పార్లమెంట్ కు వెళ్లినా, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న పంచె ధరిస్తుంటారు. ఉత్తరాది రాజకీయ నేతలు వీరిపై సెటైర్లు వేసినా ఎప్పుడూ పట్టించుకోరు. గతంలో తమిళనాడును ఏలిన ప్రతీ ముఖ్యమంత్రి ఇలా సంప్రదాయ పంచె కట్టునే కొనసాగించారు. విజయ్ కూడా తన సీఎం ప్రమాణస్వీకారంలో అలాగే కనిపిస్తారని భావించినా బ్లేజర్ సూట్ తో వచ్చి ఆశ్చర్య పరిచారు. ఇప్పుడు మళ్లీ ఆయన పంచె కట్టుకు మారడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

లిక్కర్ కేసులో జగన్ పీఏ కేఎన్ఆర్ విచారణ - ఆస్తుల చిట్టా
Oneindia Telugu28 May 2026
లిక్కర్ కేసులో జగన్ పీఏ కేఎన్ఆర్ విచారణ - ఆస్తుల చిట్టా

లిక్కర్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతల విచారణ.. అరెస్ట్ జరిగిన ఈ కేసులో మాజీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ ను సిట్ విచారణ చేసింది. పలు ఆర్దిక లావాదేవీల పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టటం పైన లోతుగా విచారణ చేసినట్లు సమాచారం. అయితే, కేఎన్ఆర్ నుంచి దాటవేసే విధంగా సమాధానాలు వచ్చాయని చెబుతున్నారు. దీంతో.. మరోసారి నాగేశ్వర రెడ్డి విచారణకు అధికారులు నిర్ణయించారు. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి సంబంధించిన లావాదేవీల్లో కేఎన్‌ఆర్‌ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా విచారణకు పిలిపించి సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ఇళ్లు, వ్యాపారాలతో పాటుగా స్థిరాస్తులు.. భార్య బ్యాంకు ఖాతాలో సుమారు 20 కోట్ల రూపాయల వరకూ లావాదేవీ లను గుర్తించినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలో ఒల్లూరు వద్ద కేవీఆర్‌ ఇన్‌ఫ్రా పేరుతో వేసిన 47ఎకరాల లే అవుట్‌ వివరాలు బయట పడ్డాయి. అందులో నుంచి ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో జగన్‌ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న కేఎన్‌ఆర్‌ పేరిట పదెకరాలు 2021లో రిజిస్టర్‌ అయినట్లు తేలింది. ఎకరా రూ.8 లక్షల చొప్పున పదెకరాల ఆస్తిని కేఎన్‌ఆర్‌ రూ.81 లక్షలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆయనకు సిట్‌ అధికారులు నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. విజయవాడలోని పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంగణంలో ఉన్న సిట్‌ ఆఫీసుకు బుధవారం ఉదయం పది గంటలకు న్యాయవాదులతో కలిసి వచ్చిన కేఎన్‌ఆర్‌ను సాయంత్రం 7.30 వరకూ సిట్‌ అధికారులు ప్రశ్నించారు. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన కేవీఆర్‌ ఇన్‌ఫ్రాలో పదెకరాల భూమి కొనుగోలు చేయడానికి రూ.81 లక్షల డబ్బు ఎక్కడి

లోకేష్ నాయకత్వంలో ఫస్ట్ టైమ్.. 2029 ఎన్నికల రోడ్ మ్యాప్ రెడీ
Oneindia Telugu27 May 2026
లోకేష్ నాయకత్వంలో ఫస్ట్ టైమ్.. 2029 ఎన్నికల రోడ్ మ్యాప్ రెడీ

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం 'మహానాడు' ఈసారి సరికొత్త హంగులతో, అనేక ప్రత్యేకతలకు వేదికగా మారుతోంది. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకను కేవలం ఒక రాజకీయ సభలా కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత, సామాజిక సమతుల్యత కలబోసి సరికొత్త వ్యూహంతో రూపొందించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు టీడీపీ సానుకూలంగా స్పందించింది. ఖర్చులను అదుపు చేస్తూ, కేడర్‌లో ఉత్సాహం తగ్గకుండా ఈసారి మహానాడును పూర్తిగా 'హైబ్రిడ్' పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గతంలో కొవిడ్ సమయంలో కేవలం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించగా, ఈ తరహా హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయడం పార్టీ చరిత్రలోనే ఇదే తొలిసారి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికగా సాగుతున్న ఈ సభకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,851 క్లస్టర్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాల కార్యాలయాలను అత్యాధునిక 'జూమ్' ప్లాట్‌ఫామ్ ద్వారా అనుసంధానించారు. ఇంటర్నెట్ ఇబ్బందులు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు 200 కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడే 'టు వే' (Two-way) ఇంటరాక్షన్ సదుపాయాన్ని కల్పించారు. ప్రతి క్లస్టర్ పరిధిలో సుమారు 300 మంది చొప్పున, మొత్తంగా 5.60 లక్షలకు పైగా కేడర్ ఒకేసారి ఆన్‌లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావడం ఒక రికార్డుగా నిలవనుంది. ఈసారి మహానాడు పరిధిని మరింత విస్తరిస్తూ తొలిసారిగా అండమాన్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. అక్కడి పార్టీ శ్రేణులను కూడా డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రధాన వేదికతో అనుసంధానం చేశారు. టీడీపీకి ఉన్న సాంకేతిక బలంతో ఏకకాలంలో 10