
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ సంచలనం సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలియంది కాదు. ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), యువ సంచలనం సుజీత్ (Director Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ (OG Movie) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలియంది కాదు. ఒక అభిమాని అయిన దర్శకుడు తన హీరోని వెండితెరపై ఎలా చూపించాలో.. సుజీత్ అంతకుమించి పవర్ స్టార్‌ను ఆవిష్కరించాడు. పవన్ కళ్యాణ్‌ను చూపించిన విధానం, ఆయనకు ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ మాస్ ఎలివేషన్లు థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. ఇక థమన్ అందించిన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను దద్దరిల్లేలా చేసి, అభిమానుల చేత విజిల్స్ వేయించాయి. దీంతో ‘ఓజీ-2’పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల ‘ఓజీ 2’ ప్రాజెక్ట్‌పై పవన్ కళ్యాణ్ టీమ్ నుంచి పరోక్షంగా కొన్ని క్రేజీ సంకేతాలు రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్ త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నట్లు సమాచారం. ఆయన వచ్చిన వెంటనే పవర్ స్టార్‌ను కలవబోతున్నారట. వీరిద్దరి మధ్య జరగబోయే కథా చర్చల్లో సీక్వెల్ స్క్రిప్ట్‌కు తుది రూపు ఇవ్వనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, వచ్చే సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది. అంతేకాదు, నవంబర్ నుంచే ఈ క్రేజీ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్‌తో