
Rashmika : సినీ తారలకు అభిమానుల నుంచి లభించే ఆదరణ ఎంత గొప్పదో, కొన్నిసార్లు అదే అభిమానం వారికి ఊహించని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘కాక్టెయిల్-2’ ప్రమోషన్స్ కోసం పూణేలోని ఒక ప్రముఖ మాల్‌కు వెళ్లిన చిత్ర బృందానికి ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ ప్రమోషనల్ ఈవెంట్లో హీరో షాహిద్ కపూర్, కథానాయికలు కృతి సనన్, రష్మిక మందన్న పాల్గొన్నారు. అయితే స్టార్ సెలబ్రిటీలను ఒక్కసారిగా చూసిన అభిమానులు, నెటిజన్లు ఉత్సాహంతో రష్మిక, కృతిలను చుట్టుముట్టారు. జనసందోహం ఒక్కసారిగా మీదకు రావడంతో అక్కడ తొక్కిసలాట లాంటి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రష్మిక తీవ్ర అసౌకర్యానికి, భయానికి గురైంది. Read Also : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ వసూళ్ల ప్రభంజనం.. తొమ్మిది రోజుల్లో వసూళ్లు ఎంతంటే..? ఆ గందరగోళ పరిస్థితిలో తోటి నటి కృతి సనన్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటోంది. రష్మిక ఇబ్బంది పడటం గమనించిన కృతి.. వెంటనే స్పందించి, రష్మికను తన రెండు చేతులతో రక్షణగా పట్టుకుని జనాల మధ్య నుండి సురక్షితంగా లోపలికి తీసుకువెళ్లింది. రష్మికకు బాడీగార్డ్‌లా అండగా నిలిచి కృతి చూపించిన ఈ కేరింగ్ వీడియో ప్రస్తుతం నెట్ ఇంట వైరల్‌గా మారింది. సొంత చెల్లెలిలా రష్మికను గుండెలకు హత్తుకుని కాపాడిన కృతి సనన్ సమయస్ఫూర్తిని, ఆమెలోని మానవత్వాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “రియల్ లైఫ్ సిస్టర్స్” అంటూ వీరిద్దరి బాండింగ్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Vijay-Rashmika: మాట నిలబెట్టుకున్న విజయ్, రష్మిక..విద్యార్థులకు అండగా దేవరకొండ ఫౌండేషన్ aaranasi Movie : వైజాగ్ లో ‘వారణాసి’ షూటింగ్ Sonu Sood: వందే భారత్‌లో ప్రయాణించిన సోనూ సూద్