రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!
Actor ProfileActor

రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema1 Jul 2026
రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

“ఇరుముడి” (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ కెరీర్ లో కొత్తగా ఉండేలా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన వీడియో గ్లిమ్ప్స్, పోస్టర్లు… ఏవీ చూసినా భక్తి, కుటుంబ భావోద్వేగాలు సమ్మేళనంగా కనిపిస్తున్నాయి. కేవలం మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేసే పద్దతి నుంచి ఈ మాస్ మహారాజా బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది “ఇరుముడి”. ఈ చిత్రంలో అయ్యప్పస్వామి మాల వేసుకున్న భక్తుడిగా కనిపిస్తాడు రవితేజ. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలతో కూడిన సన్నివేశాలే ఎక్కువ కనిపిస్తాయట. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో శివ నిర్వాణ ఈ కథను మనసుని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు అని టీం చెప్తోంది. ఐతే, ఈ సినిమా పూర్తిగా “సాఫ్ట్” చిత్రం కాదు. ఇందులో కూడా మంచి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే కథలో ఉండే “ట్విస్ట్” ఈ సినిమాకి హైలెట్ అని అంటున్నారు. ఈ మధ్య పెద్ద సినిమాలన్నింటిలో ఎదో ఒక ట్విస్ట్ పెడుతున్నారు. “పెద్ది” చిత్రంలో రామ్ చరణ్ కాలు విరిగిపోయిన ట్విస్ట్ అందరికీ తెలుసు. మరి “ఇరుముడి”లో ఏమి ట్విస్ట్ ఉందో. ఆగస్టులో విడుదల కానున్న ఈ సినిమాపై రవితేజ చాలా నమ్మకంగా ఉన్నాడు