రణబాలిలో రాక్షసుడు.. విజయ్ దేవరకొండ అరుదైన ఘనత
Actor ProfileActor

రణబాలిలో రాక్షసుడు.. విజయ్ దేవరకొండ అరుదైన ఘనత

Total News1
Movie Updates0
Sources1
రణబాలిలో రాక్షసుడు.. విజయ్ దేవరకొండ అరుదైన ఘనత
Sakshi17 Jun 2026
రణబాలిలో రాక్షసుడు.. విజయ్ దేవరకొండ అరుదైన ఘనత

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలితో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్‌ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, మమ్మీ మూవీ విలన్ అర్నాల్డ్ వోస్లో ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీలో సర్ థియోడర్ హెక్టర్ అనే ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ స్వయంగా వెల్లడించారు. జూన్ 16న అ‍ర్నాల్డ్ వోస్లో పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. రణబాలిలో అర్నాల్ట్‌ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. నా చిన్నప్పుడు చూసిన సినిమాలలో 'మమ్మీ' నాకు ఎంతో ఇష్టమైన చిత్రమని రాసుకొచ్చారు. అందులోని ప్రతి పాత్ర నాకు నచ్చిందన్నారు. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా రాక్షసులు నిజంగా ఉండగలరని నమ్మేలా చేసింది మాత్ర.. ఆ సినిమాలోని ప్రతినాయకుడైన అర్నాల్డ్ వోస్లోనే అని ప్రశంసలు కురిపించారు. అర్నాల్డ్ ఎంట్రీతో విజయ్ దేవరకొండ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇద్దరు ప్రముఖ హాలీవుడ్ స్టార్స్‌తో నటించిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించారు. గతంలో విజయ్ హీరోగా వచ్చిన లైగర్‌ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో కలిసి నటించారు. ఇప్పుడు రణబాలిలో అర్నాల్డ్ వోస్లో ఎంట్రీతో ఏ హీరోకు సాధ్యం ఇద్దరు గ్లోబల్ స్టార్స్‌తో నటించిన అరుదైన రికార్డ్‌ సాధించారు. కాగా.. రణబాలి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు) RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు) చ‌రిత్ర సృష్టించిన లియోన‌ల్ మెస్సీ (ఫోటోలు) గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్‌ ఆటా.. పాట (ఫోటోలు) వడ్డే నవీన్