రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్
Actor ProfileCelebrity

రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్
AP7AM12 Jul 2026
రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో వస్తున్న సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు 'తలైవా 173'గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి 'ధర్మన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆపరేషన్ థియేటర్‌లో రజనీకాంత్, చేతిలో సర్జికల్ బ్లేడ్‌తో నిల్చొని ఉండగా... ఆయన కాలు కింద ఒక రౌడీ పడి ఉన్నట్టుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమాలో రజనీ డాక్టర్‌గా కనిపించబోతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. టైటిల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ కమల్ హాసన్ 'ధర్మమే వెల్లుమ్!' (ధర్మమే గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు.వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌కు మొదట దర్శకుడిగా సుందర్ సిని ప్రకటించారు. కానీ, ఆయన తప్పుకోవడంతో ఆ తర్వాత సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే, అనూహ్యంగా ఆయన కూడా ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో 'డ్రాగన్' ఫేమ్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ, అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీతలు అనిబరివ్ ద్వయం స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి