రజినీ ధర్మన్ కు తెలుగు టచ్
Actor ProfileActor

రజినీ ధర్మన్ కు తెలుగు టచ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రజినీ ధర్మన్ కు తెలుగు టచ్
Telugu Times6 Aug 2026
రజినీ ధర్మన్ కు తెలుగు టచ్

భారతీయ సినీ పరిశ్రమలో భాషల మధ్య సాంకేతిక నిపుణుల మార్పిడి కొత్త విషయం కాదు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ విభాగంలో తమిళ ఇండస్ట్రీకి చెందిన సినిమాటోగ్రాఫ‌ర్లు తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తెలుగు సినిమాల‌తో తన టాలెంట్ ను నిరూపించుకున్న సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి(niketh bommi) ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ధర్మన్(Dharman) సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ గా బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది. భారీ స్థాయి తమిళ ప్రాజెక్ట్‌లో తెలుగు టెక్నీషియన్‌కు ఈ అవకాశం రావడం పరిశ్రమలో ఆసక్తిని కలిగిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన నికేత్ బొమ్మి, తర్వాత తెలుగు సినిమాల్లో తన ప్రత్యేక విజువల్ స్టైల్‌తో గుర్తింపు సంపాదించాడు. యుద్ధం శరణం(Yuddham saranam), ఈ నగరానికి ఏమైంది(ee nagaraniki emaindhi), యూటర్న్(Uturn), అంటే సుందరానికి(Ante sundaraniki), 35-చిన్న కథ కాదు(35 chinna katha kadhu) వంటి సినిమాల్లో అతని కెమెరా పనితనం ప్రశంసలు అందుకుంది. తమిళంలో రూపొందిన ఆకాశం నీ హద్దురా(Aakasam Nee Hadhura), డ్రాగన్(Dragon), డ్యూడ్(Dude) సినిమాల ద్వారా కూడా తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. డ్రాగన్ డైరెక్ట‌ర్ అశ్వత్ మారిముత్తు(Ashwin Marimuthu) మరోసారి నికేత్‌పైనే నమ్మకం ఉంచి ధర్మన్ కోసం ఎంపిక చేయడం విశేషం. స్టార్ హీరో సినిమా కావడంతో పేరొందిన సినిమాటోగ్రాఫర్లను తీసుకురాకుండా, తనకు తెలిసిన టాలెంట్ ను ఎంక‌రేజ్ చేయ‌డం డైరెక్ట‌ర్ విశ్వాసాన్ని చూపిస్తోంది. కమల్ హాసన్(kamal Haasan) నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా స‌క్సెస్ అయితే నికేత్ బొమ్మి కెరీర్‌కు మరింత అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి