
భారత వాయు సేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు.ఆదిలాబాద్ లో భారతీయ వాయుసేన ఆధ్వర్యంలో రానున్న ఎయిర్ పోర్ట్ దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశమైనందున, దానిని భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని రక్షణశాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు.భారత వాయుసేన టెర్మినల్ తో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్ తో పాటుగా కార్గో, ఎంఆర్‌ఓ (MRO), హ్యాంగర్ (HANGAR) సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.ఇటీవల మధ్య ఆసియాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ తమ హ్యాంగర్స్ ను ఏర్పాటు చేసుకోవడానికి సరైన ప్రదేశాలను అన్వేషిస్తున్నాయని, హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అత్యంత అనుకూలమైనందున ఆ దిశగా అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.తమ కీలకమైన ప్రాజెక్టు ఏర్పాటుకు డీఆర్‌డీఓ/డీఆర్‌డీఎల్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీప ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజెక్ట్‌ను త్వరగా మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి