
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, నేటికీ ఆరు గ్యారంటీలను నెరవేర్చలేక పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు (Ramachander Rao) విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి హామీల అమలులో వైఫల్యాన్ని వివరిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ (CM Revanth)ను రామచందర్ రావు కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగ విలువలు, హామీల అమలుపై పదేపదే పేర్కొనే రాహుల్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలను వివరించాల్సి ఉందన్నారు. విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్న రాహుల్ వారికిచ్చిన హామీలను మరచిపోయి ఉంటారని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ అగ్రనాయకత్వం వద్ద ప్రత్యేక స్థానం ఉందని, ఆయన రాహుల్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించగలరనే విశ్వాసం తనకు ఉందన్నారు. తన లేఖకు స్పందించకపోయినా, రాహుల్ అపాయింట్‌మెంట్ ఇప్పించకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహమే అవుతుందన్నారు. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రచారం చేసిన సోనియా (Sonia), రాహుల్, ప్రియాంక ( Priyanka) వ్యక్తిగతంగా ఇచ్చిన హామీ మేరకే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు