రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి మహిళకు రూ. 1000
Actor ProfilePolitician

రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి మహిళకు రూ. 1000

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి మహిళకు రూ. 1000
Oneindia Telugu30 Aug 2026
రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి మహిళకు రూ. 1000

పంజాబ్ లో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దాదాపు 52 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించే విధంగా ' ముఖ్యమంత్రి మావన్ దియన్ సత్కార్ యోజన' అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. సంగ్రూర్ జిల్లాలోని ధూరి నియోజకవర్గంలో ప్రారంభించారు. 2022 లో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కీలక ఆరోపణలు చేస్తున్నాయి. 2027 ఎలక్షన్స్ నేపథ్యంలో ఓట్ల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపాయి. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు ప్రతి నెలా రూ. 1000 అందుతాయి. ఎస్సీ కేటగిరీకు చెందిన మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ. 1500 అందుతాయి. దాదాపు 40 లక్షల మంది మహిళలు ఈ పథకం కోసం రిజిస్టర్ చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ధూరి నియోజకవర్గంలో ఈ పథకానికి సంబంధించిన వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. అర్హులైన మహిళల అకౌంట్లలో తదుపరి మూడు నెలలకు సంబంధించిన నగదు డైరెక్ట్ గా జమ అవుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు రూ. 3వేలు అందనున్నాయి. అలాగే ఎస్సీ మహిళకు ప్రతి నెలా రూ. 4,500 అందనున్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇలా మూడు నెలలకు సంబంధించిన నగదు లబ్దిదారుల ఖాతాల్లో పడనుంది. ఈ మేరకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు మెసేజ్ లు వస్తాయని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పథకంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. "ఎంతో ప్రణాళికతో