
తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. అందుకు క్రమంగా కార్యాచరణ మొదలు పెడుతోంది. ప్రధాని మోదీ ఇటీవలే రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లగా. రేపు రాష్ట్రానికి పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ 4 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై దిశానిర్దేశం హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. అందుకు క్రమంగా కార్యాచరణ మొదలు పెడుతోంది. ప్రధాని మోదీ ఇటీవలే రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లగా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం పెంచటం, త్వరలో జరిగే నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మూడు రోజులపాటు రాష్ట్ర నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సత్తా చాటేలా రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేస్తారని పేర్కొన్నాయి. రాష్ట్ర బీజేపీలో కొంతమంది నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నా.. క్రియాశీలంగా పనిచేయటం లేదని అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కష్టపడుతున్నా, ఆయన బృందంలోని ఎక్కువ మంది సొంత పనులకే పరిమితమవుతున్నారన్న విషయం ఢిల్లీకి చేరింది. ఒకటిరెండు మోర్చాలు తప్ప.. జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయం క్యాడర్‌లో ఉంది. ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 15 రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాలకు కూడా కొందరు నేతలు హాజరు కాలేదు. అలాంటి నేతలందరికీ నితిన్ నబిన్ హెచ్చరికలు జారీచేయబోతున్నారని కొందరు ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సకు సమాన దూరం పాటించాలని హైకమాండ్ నిర్దేశించినా కొందరు పట్టించుకోలేదని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్ అధిష్ఠానానికి నివేదిక అందించినట్లు సమాచారం. ఈ అంశంపైనా నబిన్ దృష్టి