
పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా కనిపించాలంటే ఇలాంటి యూ నెక్ బ్లౌజ్ డిజైన్ ప్రయత్నించండి. పట్టు లేదా బెనారస్ చీరలతో యూ నెక్ బ్లౌజ్ ట్రై చేయండి. చీర సింపుల్‌గా ఉంటే ఇలాంటి బ్లౌజులను ప్రయత్నించవచ్చు. పోల్కీ జ్యువెలరీతో లేదా నగలు లేకుండా కూడా దీన్ని వేసుకోవచ్చు. జర్దోసీ వర్క్ తో వచ్చే వీ నెక్ బ్లౌజ్ ఇది. రాశీ ఖన్నా దీన్ని క్వార్టర్ స్లీవ్స్‌తో వేసుకుంది. రెడీమేడ్‌గా అయితే ఇది రూ.1000 లోపే దొరుకుతుంది. బోల్డ్ లుక్ ఇష్టమైతే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ లేదా కాటన్‌తో చేసిన ట్యూబ్ బ్లౌజ్ వాడండి. ఇది చాలా ఫ్యాషన్ గా ఉంటుంది. చీర ఏదైనా సరే, నలుపు రంగు బ్లౌజ్ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది. బడ్జెట్‌లో గ్లామరస్‌గా కనిపించాలంటే, ప్యాడెడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను ఎంచుకోండి. బ్రాలెట్ బ్లౌజ్‌లు ఏ అవుట్‌ఫిట్‌తోనైనా బావుంటాయి. భిన్నమైన లుక్‌ను ఇస్తాయి. గ్లామరస్ గా కనిపించాలనుకుంటే, ఇలాంటి బ్లౌజ్‌ను కొనండి. బ్యాక్‌లెస్ బ్లౌజ్ ఎంతో ట్రెండీగా ఉంటుంది. డబుల్ డోరీతో ఉన్న ఇలాంటి బ్లౌజ్‌ను లెహంగా, ప్లెయిన్ చీర, స్కర్ట్‌లతో వేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. Bottu Neckalce designs: చీరల మీదకు అదిరిపోయే బొట్టు నక్లెస్ డిజైన్లు Pressure Cooker: కుక్కర్ నుంచి నీళ్లు కారుతున్నాయా? ఇలా సరి చేయండి Toe Ring Designs: సింపుల్, స్టైలిష్ డిజైన్ మెట్టెలు.. ఓ లుక్కేయండి! Pimples: మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!
