రివర్ సాండ్ కు గుడ్ బై చెప్పాల్సిందే
Actor ProfilePolitician

రివర్ సాండ్ కు గుడ్ బై చెప్పాల్సిందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రివర్ సాండ్ కు గుడ్ బై చెప్పాల్సిందే
TeluguOne7 Jul 2026
రివర్ సాండ్ కు గుడ్ బై చెప్పాల్సిందే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన వేగంగా పుంజుకుంటున్న తరుణంలో ఇసుక కొరత, ఇసుక విధానాలపై సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పునకు, రాజకీయ జయాపజయాలకు ఇసుక ఒక ముఖ్యమైన పారామీటర్‌గా మారుతోందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ సంచాలకుడు, ప్రముఖ ఖనిజరంగ పరిశోధకుడు డాక్టర్ వి.డి. రాజగోపాల్ విశ్లేషించారు. ఇంటలెక్చ్యువల్ టాక్ షో విత్ తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇసుక సంక్షోభం, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన సంచలన విషయాలు చెప్పారు. నదుల నుండి ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయని డాక్టర్ రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లో ఇసుక పొరలు నీటిని నిల్వ ఉంచే స్పాంజ్‌లా పనిచేస్తాయని, వాటిని పూర్తిగా తొలగిస్తే వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోతుందని హెచ్చరించారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోని నదీ గర్భాల్లో విపరీతమైన డ్రెడ్జింగ్ జరగడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, వాల్టా నిబంధనలను పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయ గండి పడుతోందని ఆయన గణాంకాలతో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇసుక ద్వారా దాదాపు రూ. 1000 కోట్ల ఆదాయం పొందుతుండగా, ఏపీలో ఉచిత విధానం వల్ల సుమారు రూ. 1500 కోట్ల మేర ప్రభుత్వ ఖజానా నష్టపోతోందని డాక్టర్ వీడీ రాజ్ గోపాల్ అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ అటు ప్రజల్లో గానీ, ఇటు నిర్మాణ రంగంలో గానీ పూర్తిస్థాయి సంతృప్తి కనిపించడం లేదని, ఇసుక లభ్యతపై ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోందని విశ్లేషించారు. నదులను కాపాడుకుంటూనే నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడానికై బెంగళూరు మోడల్ ను తెలుగు రాష్ట్రాలు అనుసరించాలని డాక్టర్ రాజగోపాల్ సూచించారు