రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది
Actor ProfileCelebrity

రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది
NTV Telugu26 Jul 2026
రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది

సినిమాలకు రివ్యూ రాసేవారికి ఎలాంటి అర్హత ఉందని ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌ (NTV Podcast) లో పాల్గొన్న ఆయన, ఈ అంశం మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిజానికి సినిమాలకు రివ్యూల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఏదైనా సినిమా బాగుందని పాజిటివ్గా రాస్తే దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నెగెటివ్ రాస్తే మాత్రం దానివల్ల సినిమా కలెక్షన్స్ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుందని అన్నారు. సినిమా చూసి రివ్యూలు రాసేవారికి కచ్చితంగా అర్హతలు ఉండాల్సిందేనని అన్నారు. పది, పదిహేను సినిమాలు తీసి, హిట్లు-ప్లాపులు అన్ని అనుభవించిన దర్శకులు లేదా నిర్మాతలు మాత్రమే సినిమాలకు రివ్యూస్ రాయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలకు రివ్యూస్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా అర్హత ఉండాల్సిందే అని పేర్కొన్న ఆయన, ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా మంచి రివ్యూస్ ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో కావాలనే కొంతమంది ఒక అజెండాతో దానిని నెగిటివ్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. సినిమాలకు అసలు రివ్యూస్ రాయాల్సిన అవసరమే లేదని, రాయమని కూడా ఎవరూ అడగడం లేదని స్పష్టం చేశారు. రివ్యూస్ రాసేసి, అది తమ వ్యక్తిగత అభిప్రాయం అని జనాల మీద రుద్దాల్సిన అవసరం అంతకన్నా లేదని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు