
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish Rao vs Revanth Reddy: 'రైతులకు రూ.29,350 కోట్ల భరోసా ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసి.. ఇప్పుడు కేంద్రం చెబితేనే పంటలు కొంటామంటున్న రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పక్కా మోసగాడు' అని బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇవ్వడానికి పైసల్లేవంటాడు కానీ.. తన గెస్ట్ హౌస్‌కు రూ.100 కోట్లు, కంచెకు రూ.17 కోట్లు.. పక్క రాష్ట్రాల్లో పేపర్ యాడ్స్‌కు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. 'నాడు ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు.. నేడు పెట్రోల్, డీజిల్, ఎరువులు, చార్జీల పేరుతో రేవంత్ సర్కార్ ప్రజల రక్తం తాగుతూ పన్నుల భారం మోపుతోంది' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమల గౌరవం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం కొనలేని దద్దమ్మ, బీఆర్ఎస్‌ను మొలకెత్తనివ్వననడం విడ్డూరం.. రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లోనే రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తాం' అని ప్రకటించారు. 'రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, మోసగాడు. నల్లమల పేరు చెప్పి నల్లమల గౌరవం రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడు' అని తెలిపారు. 'రైతులకు ఇప్పటివరకు రూ.29,350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీపడ్డాడు. ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయింది. మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌ను మొలకెత్తనియ్య అని అంటున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కొడంగల్‌లో రేవంత్