రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు.. తెలంగాణ నీటి హక్కుల
Actor ProfilePolitician

రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు.. తెలంగాణ నీటి హక్కుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు.. తెలంగాణ నీటి హక్కులపై మాజీ మంత్రి పువ్వాడ
Namasthe Telangana3 Aug 2026
రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు.. తెలంగాణ నీటి హక్కులపై మాజీ మంత్రి పువ్వాడ

Puvvada Ajaykumar | చంద్రబాబు మాటలు విని తెలంగాణ నీటి హక్కులు హరిస్తే రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే భద్రాచలం పట్టణం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ జలహక్కులు కాపాడాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు విని తెలంగాణకి రావాల్సిన కృష్ణా, గోదావరి నదీజలాల హక్కులను పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి పువ్వాడ హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే భద్రాచలం పట్టణం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని గతంలో తాను మంత్రిగా ఇదే అంశాన్ని లేవనెత్తానని పువ్వాడ గుర్తు చేశారు. 2028-29 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 50 లక్షల క్యూ సెక్యుల నీటిని ఆంధ్ర ప్రాంత ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారని.. కనీసం భద్రాచలం ముంపు సమస్య మీద సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు లేవని కనీసం నష్టంపై సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక.. పోలవరం వలన భద్రాచలంలో ముంపు సమస్యపై సమగ్ర సర్వే చేసి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పువ్వాడ డిమాండ్ చేశారు. పోలవరం వల్ల భద్రాచలం ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక అని ఖమ్మం జిల్లా ప్రజలకు రైతులకు వరప్రదాయని లాంటిదని ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టుని కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. నదీజలాల హక్కులు సాధించాలంటే గిరిజన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని మాజీ మంత్రి