రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్
Actor ProfilePolitician

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్

Total News1
Movie Updates0
Sources1
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్
Asianet News Telugu14 Jun 2026
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక సూపర్ న్యూస్. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇకపై వెయిటింగ్ లిస్ట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముందే చెప్పేస్తుంది. ఈ దశాబ్దంలోనే రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్‌లో రాబోతున్న అతిపెద్ద మార్పు ఇది. వచ్చే ఆగస్టు నెల నుంచి భారతీయ రైల్వే సరికొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. 1986 నుంచి అంటే దాదాపు 40 ఏళ్లుగా వాడుతున్న పాత సిస్టమ్‌కు రైల్వే శాఖ బైబై చెప్పేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వారంలోనే రైల్ భవన్‌లో సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చాలా ఫాస్ట్‌గా టికెట్లు బుక్ అయ్యేలా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను డిజైన్ చేశారు. భారతీయ రైల్వే ప్రస్తుతం వాడుతున్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ చాలా పాతది. దీనిని 1986లో ప్రవేశపెట్టారు. గత నాలుగు దశాబ్దాలుగా ఈ సిస్టమ్ ఆధారంగానే దేశంలో రైలు టికెట్ల బుకింగ్ సాగుతోంది. మధ్యలో అవసరాన్ని బట్టి ఈ సిస్టమ్‌ను కాస్త అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, ఇప్పుడు మాత్రం పూర్తిగా కొత్త టెక్నాలజీతో దీని రూపురేఖలను మార్చేస్తున్నారు. డిజిటల్ కాలానికి తగ్గట్టుగా ఈ కొత్త సిస్టమ్ ఉండబోతోంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం రైలు టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ స్వయంగా వెల్లడించింది. కొత్త రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌ను మోడ్రన్ టెక్నాలజీతో తయారు చేయడం వల్ల, ఒకే సమయంలో భారీ సంఖ్యలో టికెట్లను బుక్ చేసుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. పాత సిస్టమ్ లాగా ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం 7 సెకన్లలోనే మీ టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. దీనివల్ల ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్