రాయదుర్గం భూముల వేలం
Actor ProfilePolitician

రాయదుర్గం భూముల వేలం

Total News2
Movie Updates0
Sources2
రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
TeluguOne18 Jun 2026
రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేలంలో ఎకరం ఏకంగా రూ. 237 కోట్ల రికార్డు ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న ఈ భూమిపై ఇప్పుడు స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ స్థలంలో తమకు ఐదు ఎకరాల భూమి ఉందని, ఇది తమ సొంత ఆస్తి అని పేర్కొంటూ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలం ప్రక్రియపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదం వెనుక సుదీర్ఘమైన చరిత్ర దాగి ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010వ సంవత్సరంలో రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో గల ఐదు ఎకరాల భూమిని అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (SBH)కు కేటాయించింది. ఆ తర్వాతి కాలంలో ఎస్బీహెచ్ బ్యాంక్ కాస్తా ఎస్బీఐ (SBI)లో విలీనమైంది. ఈ ఐదు ఎకరాల భూమిని ఆఫీస్ కాంప్లెక్స్ మరియు ఐటీ భవనాల నిర్మాణాల కోసం కేటాయించినప్పుడు, బ్యాంక్ యాజమాన్యం అప్పట్లోనే రూ. 13.33 కోట్ల పూర్తి విక్రయ సొమ్మును మరియు ఇతర ఫీజులను ఏపీఐఐసీ (APIIC)కి అధికారికంగా చెల్లించింది. ఈ కొనుగోలుకు సంబంధించి 2011లో ఇరుపక్షాల మధ్య సేల్ అగ్రిమెంట్ కూడా పూర్తయింది. ఈ స్థలంలో ఒక బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్ బిల్డింగ్‌తో పాటు మూడు ఏటీఎం (ATM) సెంటర్లను కూడా నిర్మించి బ్యాంక్ తన స్వాధీనంలో ఉంచుకుంది. అయితే, నిర్మాణాల ప్రక్రియలో ఆలస్యం జరిగిందనే కారణంతో 2021 జనవరి

రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే
Andhra Jyothy18 Jun 2026
రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే

హైదరాబాద్‌లోని రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్: రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని టీజీఐఐసీ (Telangana Industrial Infrastructure Corporation), గౌర వెంచర్స్‌కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లోని భూమికి టీజీఐఐసీ ఇటీవల వేలం నిర్వహించింది. ఈ స్థలాన్ని ఎకరాకు రూ.237కోట్ల చొప్పున గౌర వెంచర్స్ కొనుగోలు చేసింది. అయితే, ఆ భూమిలో 5 ఎకరాలు తమదేనంటూ హైకోర్టును ఎస్బీఐ బ్యాంక్ ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. సర్వే నంబర్ 83/1లోని 5 ఎకరాల భూమి తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈరోజు (గురువారం) విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాయదుర్గం భూముల వేలంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ పూర్తి.. ‘తెలియదు, గుర్తులేదు’ అంటూ సమాధానం కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్