రామకృష్ణారావు కు రేవంత్ కీలక పదవి
Actor ProfilePolitician

రామకృష్ణారావు కు రేవంత్ కీలక పదవి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రామకృష్ణారావు కు రేవంత్ కీలక పదవి- నుంచి అజిత్ రెడ్డి ఔట్, ఆ స్థానంలో
Oneindia Telugu27 Jul 2026
రామకృష్ణారావు కు రేవంత్ కీలక పదవి- నుంచి అజిత్ రెడ్డి ఔట్, ఆ స్థానంలో

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలనా పరంగా అధికార వ్యవస్థలో కీలక మార్పులు చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 ఐఏఎస్ అధికారి సంజయ్ జాజూను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న రామకృష్ణారావు కు కొత్త బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా 13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు.. పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియ నుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ గా సంజయ్ జాజూ ను నియమించారు. 1992 బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజూ కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. కాగా, పదవీ విరమణ చేస్తున్న రామకృష్ణారావు గత ఏడాది ఆగస్టులోనే రిటైర్ అవ్వాల్సి ఉంది. సీఎం రేవంత్ ప్రత్యేక వినతులతో ఆయన పొడిగింపుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో, ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్న రామకృష్ణారావు కు మరో కీలక పదవి దక్కింది. ముఖ్యమంత్రి సలహాదారుగా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేవంత్ పాలనా పరమైన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన రామకృష్ణారావు కు ఇప్పుడు ఏరీ కోరి ఈ పదవి అప్పగించారు.నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!సీఎం రేవంత్ పాలనా పరంగా కీలక నిర్ణయాలుకాగా, సీఎంవో నుంచి అజిత్‌ రెడ్డికి ఉద్వాసన పలికి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బదిలీ చేసింది. ఎన్‌. శ్రీధర్‌కు ముఖ్యమంత్రి సెక్రటరీగా ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. సభ్యసాచి ఘోష్‌కు హ్యాండ్ల్యూమ్‌, టెక్స్‌టైల్స్‌ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. అలాగే శైలజా రామయ్యర్‌ ను అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, అహ్మద్‌ నదీమ్‌కు పొలిటికల్‌(GAD) ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. రాహుల్ బొజ్జాకు ప్రకృతి విపత్తుల మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఎం. రఘునందన్‌రావుకు మైన్స్ అండ్‌ జియాలజీ శాఖ అదనపు