
తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సినిమా దొంగరాముడు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, సావిత్రి హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో జమున ఏఎన్నార్ చెల్లెలుగా నటించింది. 1955లో రిలీజ్ అయిన ఈ సినిమాకు కె.వి. రెడ్డి దర్శకుడు. కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యత, మానవత్వం, వంటి జనాలకు ఉపయోగపడే అంశాలను కలగలిపి అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా దొంగరాముడు. ఈ చిత్రం నేటికీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాము (అక్కినేని నాగేశ్వరరావు) తన చెల్లెలు లక్ష్మి(జమున)ని ఎంతో ప్రేమగా పెంచాలని భావిస్తాడు. అయితే పేదరికం, ఆకలి, అనాథ జీవితం అతడిని చిన్నచిన్న దొంగతనాల వైపు నెడతాయి. తల్లి అనారోగ్యం వల్ల మందులు దొంగతనం చేస్తూ.. దొరికిపోయి కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బాల నేరస్తుల జైల్లో అతన్ని వేస్తారు. రాము జైలులో ఉండగా తల్లి మరణించడంతో.. చెల్లెలు లక్ష్మి అనాథాశ్రమంలో చేరుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన రాము కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. నిజాయితీగా జీవించాలనుకున్నా, గతం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. సమాజం అతడిని అనుమానంతో చూస్తుంది. మరోవైపు తన చెల్లెలు కోసం చేసే ప్రయత్నాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సీత (సావిత్రి) రాము జీవితంలోకి వస్తుంది. ఆమె ప్రేమ, నమ్మకం రాముకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయి. చెల్లెల్ని కలుసుకోవాలన్న రాము ప్రయత్నాల వల్ల లక్ష్మీ ఇబ్బందులు పడుతుంటుంది. ఆ సమయంలోనే ఆమెకు డాక్టరు మోహన్ అండగా ఉంటాడు. ఈ క్రమంలో రాముపై హత్యానేరం మోపబడుతుంది. ఈవిషయంలో సీత రాముకి అండగా ఉంటుంది. చివరికి రాము తన చెల్లెల్ని కలుసుకుంటాడా? తనపై ఉన్న నేరస్థుడి ముద్రను చెరిపేసుకుని సమాజంలో గౌరవంగా నిలబడతాడా? అనేదే మిగిలిన కథ. 'దొంగరాముడు' సినిమా సాధారణ దొంగ కథ కాదు. పరిస్థితుల కారణంగా నేరం చేసిన వ్యక్తి జీవితంలో