రోబోల కోసం.. 1000 మంది ఉద్యోగులను పీకేసిన కంపెనీ.. కార్మికుల ఆగ్రహం
Actor ProfilePolitician

రోబోల కోసం.. 1000 మంది ఉద్యోగులను పీకేసిన కంపెనీ.. కార్మికుల ఆగ్రహం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోబోల కోసం.. 1000 మంది ఉద్యోగులను పీకేసిన కంపెనీ.. కార్మికుల ఆగ్రహం
Samayam Telugu29 Jun 2026
రోబోల కోసం.. 1000 మంది ఉద్యోగులను పీకేసిన కంపెనీ.. కార్మికుల ఆగ్రహం

General Motors: పలు రంగాల్లోని ఉపాధి అవకాశాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelegence), రోబోటిక్స్ గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగాలు భారీగా పోతాయనే ఆందోళనలను ఇప్పటికే తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలతో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. దేశీయ, ప్రపంచ స్థాయి కంపెనీల్లో లేఆఫ్స్‌లకు ఏఐ టూల్స్, రోబోలు ప్రధాన కారణంగా మారుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సెక్టార్ కంపెనీ జనరల్ మోటార్స్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ధుమారం చెలరేగుతోంది. కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 50 రోజులను పనిలో పెట్టుకునేందుకు ఏకంగా 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెయ్యి మంది స్థానాలను రోబోలతో భర్తీ చేసినట్లు పేర్కొంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.మిషిగన్‌లోని తన కేంద్ర కార్యాలయంలో కొలాబరేటివ్ రోబోట్స్ (కోబోట్స్) ను జనరల్ మోటార్స్ లిమిటెడ్ ( General Motors ltd ) పనిలో పెట్టుకుంది. వాహనాల అసెంబ్లింగ్ లో మిగతా ఉద్యోగులతో కలిసి కోబోట్స్ పని చేస్తున్నాయి. తమ కార్యకలపాల్లోకి అత్యాధునిక టెక్నాలజీని చొప్పించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోబోలను తీసుకువచ్చినట్లు కంపెనీ ప్రతినిధి కెవిన్ కెల్లీ వెల్లడించారు. అన్ని భద్రతా రూల్స్ పాటిస్తూనే, తమ ఉత్పత్తులు పోటీని తట్టుకునేలా చూసుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే జనరల్ మోటార్స్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెషిన్లు తమ ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. '1000 ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు వారి స్థానంలో రోబోలు వచ్చాయి. ఇదే భవిష్యత్తు అని చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలకు ఉద్యోగాలు ఉండవు' అని యూనియన్ ప్రతినిధులు వాపోయారు.జనరల్ మోటార్స్ తన మిషిగన్‌లోని ప్రధాన ఫ్యాక్టరీ జీరో ప్లాంట్‌లో కొలాబరేటివ్ రోబోట్స్ లేదా కోబోట్స్ లను ప్రవేశపెట్టింది. ఫ్యానుక్ (Fanuc) సంస్థ తయారు చేసిన దాదాపు 50 కొత్త రోబోటిక్ యూనిట్లను ఉద్యోగులతో