రేపు వరంగల్ కు పవన్ కళ్యాణ్.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని
Actor ProfilePolitician

రేపు వరంగల్ కు పవన్ కళ్యాణ్.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Total News1
Movie Updates0
Sources1
రేపు వరంగల్ కు పవన్ కళ్యాణ్.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని
10TV Telugu16 Jun 2026
రేపు వరంగల్ కు పవన్ కళ్యాణ్.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

రేపు వరంగల్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్. బాలుడి చివరి కోరిక తీర్చనున్న అధినేత. త్వరలో తెలంగాణ జాయినింగ్స్ కమిటీ నియామకం. Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ అనే చిన్నారి చివరి కోరికను తీర్చేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ బాలుడిని పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి, కొంత సమయం గడపనున్నారు. ఈ మానవీయ కోణంతో కూడిన భేటీ అనంతరం, వరంగల్‌లోని ప్రసిద్ధ క్షేత్రమైన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. Cough Syrup: 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్‌’లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పనిసరి.. ఇటీవలి కాలంలో 'తెలంగాణ స్థానికత' అంశంపై రాజకీయంగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటనకు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పర్యటన సందర్భంగా స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటన తెలంగాణలో జనసేన క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన అధినేత (Pawan Kalyan)కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించేందుకు, వలసలను ప్రోత్సహించేందుకు వీలుగా త్వరలోనే ఒక ప్రత్యేక 'జాయినింగ్స్ కమిటీ'ని నియమించనున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది. ఈ కమిటీ ద్వారా క్షేత్రస్థాయి నుంచి బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకుని, తెలంగాణలో జనసేన ఉనికిని చాటాలని వ్యూహాలు రచిస్తున్నారు