రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ ప్రారంభించడం ఎలా
Actor ProfileActor

రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ ప్రారంభించడం ఎలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ ప్రారంభించడం ఎలా
Sakshi24 Jul 2026
రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ ప్రారంభించడం ఎలా

డెహ్రాడూన్‌: వ్యాపారం ప్రారంభించాలంటే భారీగా పెట్టుబడి ఉండాలని చాలా మంది భావిస్తారు. కానీ, వ్యాపార నైపుణ్యాలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్, స్థానిక డిమాండ్‌ను అర్థం చేసుకుంటే రూపాయి పెట్టుబడి లేకుండా కూడా డబ్బు సంపాదించవచ్చని నిరూపించారు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తనీ ఠాకూర్ ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేశ్‌లో ఆయన చేసిన సోషల్ ఎక్స్‌పెరిమెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తనీ ఠాకూర్ సమాజంలో మనుషుల ప్రవర్తన, వారి మనస్తత్వం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, కేవలం తన తెలివితేటలతో డబ్బు సంపాదించడం ఎలా అనే సవాలును ఆయన ఎంచుకున్నారు. దీనికోసం ఆయన ఆధ్యాత్మిక నగరమైన రిషికేశ్‌లోని గంగా నది తీరాన్ని ఎంపిక చేసుకున్నారు రిషికేశ్ ఆధ్యాత్మిక వాతావరణానికి, అక్కడి సంస్కృతికి సరిపోయేలా తనీ ఠాకూర్ సాంప్రదాయ దుస్తులను ధరించారు. ఒక చిన్న పళ్లెంలో తిలకం (బొట్టు) తీసుకుని వీధుల్లోకి వెళ్లారు. గంగా నది తీరంలో తిరిగే పర్యాటకులను, భక్తులను సమీపించి వారి నుదుటిపై తిలకం దిద్దడం ప్రారంభించారు. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన మలుపు ఏమిటంటే, ఆయన ఎవరినీ డబ్బులు అడగలేదు. అంతేకాకుండా, సాధారణంగా డబ్బులు అడిగే వారు చేసేలా తన ప్లేటులో ఎలాంటి నోట్లను గానీ, నాణేలను గానీ ప్రదర్శించలేదు. ప్రయోగం ప్రారంభించిన మొదటి గంటలో పెద్దగా స్పందన రాలేదు. చాలా మంది ఠాకూర్‌ను చూసి తిరస్కరించారు. మొదటి గంటలో కేవలం 20 మంది మాత్రమే ఆయనతో తిలకం పెట్టించుకున్నారు. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ అక్కడి భక్తులు ఆయన నిస్వార్థ సేవను, భక్తిని గమనించారు. తిలకం పెట్టించుకున్న వారు కేవలం కృతజ్ఞతతో సరిపెట్టకుండా, భక్తిభావంతో స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. ఎవరినీ ఒక్క రూపాయి కూడా డిమాండ్ చేయకుండానే, కేవలం 3 గంటల వ్యవధిలో ఆయన ప్లేటులోకి ఏకంగా రూ.2,350 జమ అయ్యాయి. ఈ సోషల్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా తనీ ఠాకూర్ నేటి