రైతులకు గుడ్ న్యూస్.. నేడే రైతు భరోసా
Actor ProfilePolitician

రైతులకు గుడ్ న్యూస్.. నేడే రైతు భరోసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైతులకు గుడ్ న్యూస్.. నేడే రైతు భరోసా పైసలు జమ! పేమెంట్ స్టేటస్ ? అర్హతలు ఇవే
Zee Telugu19 Aug 2026
రైతులకు గుడ్ న్యూస్.. నేడే రైతు భరోసా పైసలు జమ! పేమెంట్ స్టేటస్ ? అర్హతలు ఇవే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Telangana Rythu Bharosa Scheme: తెలంగాణ రైతు భరోసా పథకం రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అర్హులైన ప్రతి రైతుకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక చేయూత అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఈ నిధులను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. శిల్పకళా వేదికలో జరిగే రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న అనంతరం సీఎం ప్రసంగించి, రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మొదటగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు రూ. 2,482 కోట్లు జమ అవుతాయి. ఎకరాకు రూ. 6,000 చొప్పున ఈ నిధులను దశలవారీగా మంజూరు చేస్తారు. మంత్రి తుమ్మల ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం.. రైతు భరోసా పథకం నిధులు మొదటగా రెండు ఎకరాల లోపు భూమి ఉన్న అన్నదాతలకు ఈ డబ్బులు అందుతాయి. కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారు జూలై 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రైతు భరోసా నిధులను నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ లో స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అక్కడ ఆధార్ నంబర్ ద్వారా ఓటీపీ నమోదు చేసి వివరాలను తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలుకు సాయం అందుతుంది. ఖరీఫ్ , రబీ సీజన్లలో ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి