
రైతుల సంక్షేమం కోసం మూడు రాష్ట్రాల సీఎంలు కదిలివచ్చారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒకేతాటిపై నిలబడి తుంగభద్ర డ్యామ్ కు కొత్త ఊపిరిని అందించారు. కర్ణాటకలో రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద రూ.51 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 33 కొత్త క్రస్ట్ గేట్లను ముగ్గురు సీఎంలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ప్రారంభించారు. రైతుల సాగునీటి అవసరాలు, డ్యామ్ భద్రత, అంతర్రాష్ట్ర జల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై నేతలు కీలక విషయాలను వెల్లడించారు.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే? : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ ఓపెనింగ్ అనేది కేవలం 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం మాత్రమే కాదన్నారు. దశాబ్దాలుగా సాగుతున్న నీటి సమస్యలకు అసలైన పరిష్కారం చూపే కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 3 రాష్ట్రాలు కలిసి ముందుకు రావడం చారిత్రాత్మక పరిణామంగా సీఎం రేవంత్ అభివర్ణించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పరిధిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 17.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 టీఎంసీల నుంచి 6 టీఎంసీలు మాత్రమే వినియోగంలోకి వస్తున్నాయని అన్నారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలతో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి నీరు అందడం లేదన్నారు. ఈ నీటి సమస్యలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలు ఏకమై చర్చలు జరపడం వల్ల అంతర్రాష్ట్ర జలవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే? : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ 3 రాష్ట్రాల రైతులకు జీవనాడిగా నిలుస్తోందని చెప్పారు. గత ఏడాది డ్యామ్‌లో 19వ గేట్ దెబ్బతిన్న